రాజేంద్రప్రసాద్ కు సానుభూతిని తెలిపిన పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్! గాయత్రి మరణం దిగ్భ్రాంతిని!

Header Banner

రాజేంద్రప్రసాద్ కు సానుభూతిని తెలిపిన పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్! గాయత్రి మరణం దిగ్భ్రాంతిని!

  Sat Oct 05, 2024 16:33        Entertainment

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. కూతురు మరణంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలియజేశారు. రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... తనకు అత్యంత ఆప్తులైన రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమని అన్నారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RajendraPrasad #PawanKalyan #JuniorNTR #Tollywood