యూట్యూబర్ హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ! ముంబయి నటి మధ్య ఓ పార్టీలో..

Header Banner

యూట్యూబర్ హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ! ముంబయి నటి మధ్య ఓ పార్టీలో..

  Sat Oct 05, 2024 20:49        India

ముంబయికి చెందిన ఓ నటిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్షసాయి తనపై అత్యాచారం చేశాడని, తన నగ్నచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ముంబయి నటి ఫిర్యాదు చేయగా, నార్సింగి పోలీసులు గత నెల 24న కేసు నమోదు చేయడం తెలిసిందే. సదరు నటి గతంలో హర్షసాయితో ఓ సినిమాలో నటించింది. ఓ రియాలిటీ షోలోనూ పాల్గొంది. 

 

ఇంకా చదవండి: ఏపీలో ఆ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు! శంకుస్థాపనపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్!

 

పోలీసుల కథనం ప్రకారం... హర్షసాయి, ముంబయి నటి మధ్య ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, మొబైల్ ఫోన్ తో ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే, హర్షసాయిపై మరో మహిళ ఫిర్యాదు చేసింది. ఆన్ లైన్ లో తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్నాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YoutuberHarshasai #Hyderabad