హైడ్రా ఎఫెక్ట్‌! హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌!

Header Banner

హైడ్రా ఎఫెక్ట్‌! హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌!

  Wed Oct 09, 2024 13:45        Real Estate

రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మందగమనంలోకి జారుకున్నది. హైదరాబాద్‌లో వరుసగా పడిపోతున్న ఇండ్ల అమ్మకాలు దీన్నే సూచిస్తున్నాయి మరి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ గృహ విక్రయాలు నీరసంగానే సాగాయి. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ వేదిక ప్రాప్‌టైగర్‌.కామ్‌ మంగళవారం దేశీయ రెసిడెన్షియల్‌ మార్కెట్‌పై ‘రియల్‌ ఇన్‌సైట్‌’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత నెల సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల్లో హౌజింగ్‌ సేల్స్‌ ఏకంగా 19 శాతం దిగజారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో 14,191 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇదే సమయంలో 11,564 యూనిట్లకే పరిమితమయ్యాయి.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

గత ఏడాదిదాకా హైదరాబాద్‌లో పరుగులు పెట్టిన స్థిరాస్తి మార్కెట్‌.. ఇప్పుడు పడకేసింది. ప్రస్తుతం కొనుగోలుదారుల్లో ఇండ్లను కొనాలన్న ఆసక్తే కనిపించట్లేదని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్‌లో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు ఒక కారణమైతే.. రుణ లభ్యత కఠినం కావడం మరో కారణమని వారు అంటున్నారు. కాగా, పరిస్థితులు ఇలాగే సాగితే కేవలం నిర్మాణ రంగమేగాక, దాని అనుబంధ రంగాలూ సంక్షోభంలోకి జారుకుంటాయని ఇండస్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైడ్రా ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. హైదరాబాద్‌లో తెచ్చిన హైడ్రా.. ఇతర నగరాల్లోని లావాదేవీలపైనా గట్టి ప్రభావాన్నే చూపుతున్నది. ఇక రాజధానిలోనైతే హైడ్రా దెబ్బకు బయ్యర్లు.. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి వర్గాలు ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనాలనే ఆలోచననే వాయిదా వేసుకుంటున్నారు. దీంతో కొత్త నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే పూర్తయిన ఇండ్లనూ కొనేవారు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడుల్ని రాబట్టుకొనేందుకు తక్కువ ధరలకు ఇస్తామన్నా ఆదరణే కరువైపోయింది. ఫలితంగా రియల్టర్లు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు.

 

ఇంకా చదవండిసచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

 

హైదరాబాద్‌సహా మొత్తం దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ప్రాప్‌టైగర్‌.కామ్‌ తాజా సర్వే జరిగింది. ఇందులో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ మినహా మిగతా 7 నగరాల్లోనూ హౌజింగ్‌ సేల్స్‌ పతనమైనట్టు స్పష్టమైంది. అయితే టాప్‌-7 నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఇండ్ల అమ్మకాలు తగ్గినట్టు తేలింది. కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 29 శాతం విక్రయాలు పెరిగాయి. గతంతో పోల్చితే 7,800 యూనిట్ల నుంచి 10,098 యూనిట్లకు ఎగిశాయి. కోల్‌కతాలో గరిష్ఠంగా 22 శాతం క్షీణించాయి. 3,607 యూనిట్ల నుంచి 2,796 యూనిట్లకు పడిపోయాయి. ఇక బెంగళూరులో 11 శాతం, అహ్మదాబాద్‌లో 9 శాతం, చెన్నైలో 8 శాతం, పుణెలో 3 శాతం, ముంబైలో 1 శాతం చొప్పున సేల్స్‌ దిగజారాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RealEstate #Hyderabad #HYDRA #Plots #Land