అమరావతి అభివృద్ధికి ముందడుగు..కోట్ల నిధులతో ప్రణాళికలు! సీఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశాలు!

Header Banner

అమరావతి అభివృద్ధికి ముందడుగు..కోట్ల నిధులతో ప్రణాళికలు! సీఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశాలు!

  Sun Nov 10, 2024 17:30        Politics

రాజధాని అమరావతి (Amaravati) నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్డీఏను (CRDA) ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన రహదారులు, డక్ట్లు, డ్రెయిన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి రాజధాని సుస్థిరాభివృద్ధికి ఏపీ సీఆర్డీఏ ప్రతిపాదనలు సమర్పించగా.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని వెల్లడించారు.


ఇంకా చదవండినామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల! నేమ్స్ లిస్ట్ మీకోసం..!



ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టు వెల్లడించారు. మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఆర్డీఏ కమిషనర్ అధీనంలోనే ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు, ఎల్లుండి దిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #rajadhani #amaravathi #development #crda #planning #todaynews #flashnews #latestupdate