ప్రతీ ముగ్గురిలో ఒకరికి ఆ సమస్య! చిన్నారుల్లో దృష్టి లోపాలకు కారణం ఇదే!

Header Banner

ప్రతీ ముగ్గురిలో ఒకరికి ఆ సమస్య! చిన్నారుల్లో దృష్టి లోపాలకు కారణం ఇదే!

  Tue Nov 12, 2024 21:03        Life Style

ఒకప్పుడు ఏజ్ బార్ అయ్యాక మాత్రమే చాలా మందిలో కంటి చూపు మందగించేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలను సైతం ఈ సమస్య వేధిస్తోంది. వరల్డ్ ఆప్తమాలజీ రిపోర్ట్స్ ప్రకారం.. భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ముగ్గురు చిన్నారుల్లో ఒకరు 'షార్ట్ సైటెడ్ నెస్' ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే కంటి చూపు తగ్గడం కారణంగా దూరంగా ఉన్న వస్తువులను చూడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య పరిభాషలో దీనిని 'మయోపియా' పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

పిల్లల్లో కంటి చూపు మందగించడానికి పోషకాహారలోపం, వివిధ అనారోగ్యాలు కూడా కారణం అవుతుంటాయి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి, స్క్రీన్ టైమ్ పెరగడమే మయోపియా వ్యాధికి కారణం అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. 1990 నుంచి ఈ సమస్య పెరుగుతూ వస్తోందని, 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మయోపియాతో బాధపడే చిన్నారుల సంఖ్య 74 కోట్లకు పెరిగే అవకాశం ఉందని చైనాలోని సున్ యాట్ సెన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

ఇక ఆధునిక టెక్నాలజీ, స్క్రీన్ టైమ్ పెరగడం కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న చాలా కామన్ సమస్యగా షార్ట్ సైటెడ్ నెస్ లేదా మయోపియా ఉంటోంది. అయితే బాల్యంలో మొదలయ్యే ఈ సమస్య క్రమంగా కంటిచూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని కూడా జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చైనా పరిశోధకుల ప్రకారం.. 54 లక్షల మంది స్టాటిస్టిక్స్ను నిపుణులు పరిశీలించగా.. వీరిలో ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్స్ నుంచి దాదాపు 50 దేశాలకు చెందిన వారు కంటి చూపు సమస్యను బాల్యంలోనే ఎదుర్కొంటున్నారని తేలింది. 5 నుంచి 19 ఏడ్ల మధ్య షార్ట్ సైటెడ్ నెస్ ఎదుర్కొంటున్న వాళ్లు దాదాపు 19 లక్షల మంది ఉన్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా భోధనా పద్ధతులు, ఎక్కువ సమయం డిజిటల్ పరికాలు లేదా స్క్రీన్లకు కేటాయించడం ఇందుకు కారణంగా ఉంటోంది. కాబట్టి రేపటి తరం దృష్టి లోపాలను ఎదుర్కో కూడదంటే నేటి బాల్యాన్ని ఆ దిశగా సిద్ధం చేయాలంటున్నారు నిపుణులు. స్క్రీన్లకు తక్కువ సమయం కేటాయించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #Kids #Children #EyeSight #Specs