నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు! సుదీర్ఘ పరిశీలన తర్వాత!
Sun Nov 10, 2024 19:45 Politicsనామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని స్పష్టం చేశారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. 30 వేల దరఖాస్తులు పరిశీలించి, 'తగిన వ్యక్తికి తగిన గౌరవం' విధానంతో అవకాశం కల్పించామన్నారు. వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువతకు, సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎంపికలు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 చైర్మన్ పోస్టులు, ఒక వైస్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. రెండో లిస్టులో ఏకంగా 62 మందిని చైర్మన్లుగా, సలహాదారులుగా నియమించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత పదవులు కోసం వచ్చిన 30 వేల దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.. నేతలను వివిధ పోస్టులకు ఎంపిక చేశారు. వీటిలో 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కాగా, క్యాబినెట్ హోదాతో రెండు సలహాదారు పోస్టులు ఉన్నాయి. పదవులు పొందిన అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #nominatedpost #declaration #greetings #CM #APCM #CBN #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.