గతంలో చంద్రబాబు సభకు రాలేదంటూ అవాస్తవాలు! వైసీపీ నేతల తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం!
Thu Nov 14, 2024 17:19 Politicsఅమరావతిః గత వైసీపీ పాలనలో చంద్రబాబునాయుడు గారు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాతే బాయ్ కాట్ చేశారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనమండలిలో వైసీపీ దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబునాయుడు గారు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు హౌస్ కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. గౌరవ సభ అయిన తర్వాత వస్తా అన్నారు. నా తల్లిని అవమానించారు. ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు ఆ రోజు. మీకు గుర్తులేవా ఇవన్నీ. అవమానించలేదని మీరు ఏవిధంగా మాట్లాడతారు.
ఇంకా చదవండి: జగనన్నా క్షమించు! ప్లీజ్ లోకేష్ అన్నా వదిలేయ్ - శ్రీరెడ్డి లేఖల రచ్చ..!
మీరున్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారు. ఇవన్నీ గుర్తులేవా మీకు. నేను కూడా మాట్లాడవచ్చు. కానీ ఏనాడూ మేం మాట్లాడలేదు. జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు. మా సభ్యులు ఏనాడూ మాట్లాడలేదు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబునాయుడు గారు ప్రతి రోజూ హౌస్ కు వచ్చారు. ప్రతి రోజూ హౌస్ లో నిలబడ్డారు. సింగిల్ గా నిలబడ్డారు సింహంలా. గుర్తుపెట్టుకోండి, పోరాడారు. నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక సభను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదీ మా చిత్తశుద్ధి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నా. జగన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా, మాట్లాడవద్దా మేము. మేం మనుషులం కాదా? తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయితే ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని బొత్స అన్నారు. మంత్రి స్పందిస్తూ.. సమర్థించడం లేదని బొత్స మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారు కదా. అది సమర్థించడం కాదా? వైసీపీ మండలిపక్ష నేత బొత్స ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.