అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ గా హిందూ మహిళ! ఇంతకీ ఎవరు ఆమె?

Header Banner

అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ గా హిందూ మహిళ! ఇంతకీ ఎవరు ఆమె?

  Thu Nov 14, 2024 11:21        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వాకి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. తాజాగా హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. తులసీ గబ్బార్డ్‌ గర్వించదగ్గ రిపబ్లికన్‌ అంటూ అభివర్ణించారు. తులసీ గబ్బార్డ్‌కు రెండు పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఆమె మనల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తులసి గబ్బార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో భాగస్వాములయ్యారు.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

తులసీ గబ్బార్డ్‌ ఎవరు ?
తులసి గబ్బర్డ్ దాదాపు రెండు దశాబ్దాలు యూఎస్‌ ఆర్మీ అయిన నేషనల్‌ గార్డ్‌లో సేవలందించారు. ఇరాక్‌, కువైట్‌లోనూ పని చేశారు. అయితే, ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. తులసి గబ్బార్డ్ 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలు. ఆమెకు భారత్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ, ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. దాంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబ్బర్డ్ సైతం హిందూ మతాన్ని విశ్వసిస్తారు. ఆమె పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు. 2020 సంవత్సరంలో తులసి గబ్బర్డ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. అయితే, మద్దతు లభించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్‌ జరిగిన సమయంలో ట్రంప్‌ని సిద్ధం చేసింది తులసీ గబ్బార్డ్‌. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబ్బర్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో.. ఆ సమయంలో కమలా హారిస్ సైతం రేసులో నిలిచారు. తులసి గబ్బార్డ్, కమలా హారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. ఇందులో తులసీ పేరు ప్రధానంగా వినిపించింది. గత ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్‌ జరిగిన సమయంలో ట్రంప్‌ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బార్డ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ట్రంప్‌ ఆమెను యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా నియమించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants