వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
Thu Nov 14, 2024 11:55 Politicsతూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యమయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు జడ్పీటీసీ విజయదుర్గా శ్రీనివాస్, నిడదవోలు జడ్పీటీసీ కొయ్యా సూర్యారావు, కొవ్వూరు జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, ధర్మవరం ఎంపీటీసీ జొన్నకూటి కోమలి, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, తాళ్లపూడి సర్పంచ్ నక్కా చిట్టిబాబు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు గారపాటి వెంకటకృష్ణ, ధర్మవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, దాపర్తి శివప్రసాద్, మర్ని తారకరాము, వల్లూరి సత్యవరప్రసాద్, నీలం వీరభద్రరావు, ఉప్పులూరి రాజేంద్ర కుమార్, ఇమ్మని వీరశంకరం, బండి అశోక్, నల్లా రామ కిషోర్, పామెర్ల నగేశ్‌కుమార్, నామా సురేంద్ర, వేణుకుమార్ దొప్పలపూడి, ఎన్. దిలీప్ కుమార్, బొల్లిన సతీశ్, గారపాటి అభిరామ్ తదితర 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
ఇంకా చదవండి: నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు! నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు సారీ చెప్తే వదిలేస్తారా!
ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందని విమర్శించారు. భాష ప్రధానమని, ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాసమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. నేనే రాజు, నేనే మంత్రి అని అనుకోకూడదని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. నేతలు స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. రాజీవ్ కృష్ణ భవిష్యత్‌ను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత గౌరవం కల్పిస్తామని, ప్రజల మెప్పు పొందాలని పేర్కొన్నారు. రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ.. అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని చెప్పారు. పార్టీకి ఆస్తిగా మారతామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి అన్ని విధాల అండగా నిలుస్తామన్నారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పశ్చిమగోదావరి జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కొత్తపల్లి లాల్, అల్లూరి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.