ఇజ్రాయెల్‌కు షాక్‌! లెబనాన్‌లో నలుగురు సైనికులు మృతి!

Header Banner

ఇజ్రాయెల్‌కు షాక్‌! లెబనాన్‌లో నలుగురు సైనికులు మృతి!

  Thu Nov 14, 2024 15:30        World

హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐడీఎఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామంలోని నలుగురు సైనికులు దాడి ప్రారంభించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ క్రమంలో ఓ భవనంలో ఉన్న నలుగురు హిబ్బొల్లా యోధులు సైనికులపైకి కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన ప్రతీకార దాడిలో నలుగురు హిజ్బొల్లా వారియర్స్‌ సైతం మరణించారు. నలుగురు సైనికులు గోలానీ బ్రిగేడ్‌లోని 51వ బెటాలియన్‌కు చెందిన సైనికులని ఐడీఎఫ్‌ పేర్కొంది. ఇంతకు ముందు అక్టోబర్ 2న లెబనాన్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఉదాసీనత పనికిరాదన్నారు. 

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికుల మరణంపై సంతాపం ప్రకటించారు. సెప్టెంబర్ 23న లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు నిర్వహించింది. అదే నెల 30న ఇజ్రాయెల్‌ సైనికులను లెబనాన్‌లో మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటివరకు 3,360 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం బీరూట్‌కు దక్షిణాన ఉన్న జనసాంద్రత కలిగిన అరమౌన్‌పై దాడి చేసింది. మరోవైపు, టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హిజ్బొల్లా బుధవారం పేర్కొంది. అయితే, ఆ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #War #Isreal #Hajbolla #Deaths