బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం! ఆ ప్రాంతలలో భారీ వర్షాల హెచ్చరిక!

Header Banner

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం! ఆ ప్రాంతలలో భారీ వర్షాల హెచ్చరిక!

  Sun Nov 24, 2024 08:44        Others

బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆ తర్వాతి రెండు రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #andhrapravasi #rainallert #heavyrains #kostha #rayalaseema #andhrapradesh #todaynews #flashnews #latestupdate