కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో మాత్రం కాదు! ఆ తర్వాతి స్థానంలో..

Header Banner

కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో మాత్రం కాదు! ఆ తర్వాతి స్థానంలో..

  Sun Nov 24, 2024 16:00        Sports

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ హేజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖావాజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత కొంతకాలంగా పరుగుల కోసం ముఖం వాచిపోయేలా ఉన్న కోహ్లీ ఆసీస్ గడ్డపైనా అదే పేలవ ఫామ్‌తో టూర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఓ సింపుల్ క్యాచ్‌ను వదిలిపెట్టేసిన కోహ్లీ చెత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విరాట్ జారవిడిచాడు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. 2019 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఏకంగా 47 క్యాచ్‌లు విడిచిపెట్టాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరూ చెరో 21 క్యాచ్‌లు విడిచిపెట్టారు. 20 క్యాచ్‌లు విడిచిపెట్టిన సిరాజ్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

 

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Sports #ViratKohli #INdia #Cricket