ప‌ర‌గ‌డుపునే చియా సీడ్స్‌ను తినాలి! ఎందుకంటే?

Header Banner

ప‌ర‌గ‌డుపునే చియా సీడ్స్‌ను తినాలి! ఎందుకంటే?

  Mon Nov 25, 2024 20:00        Health

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే పోష‌కాలు అధికంగా ఉన్న ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహారాల్లో చియా విత్త‌నాలు కూడా ఒక‌టి. చియా సీడ్స్‌ను చాలా మంది చూసే ఉంటారు. చిన్న‌గా న‌ల్ల‌ని రంగులో ఉంటాయి. వీటిలో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. చియా విత్త‌నాలు మ‌ధ్య అమెరికాలో ముందుగా క‌నుగొన‌బ‌డ్డాయి. త‌రువాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటిని వాడ‌డం మొద‌లు పెట్టారు. ఇక మ‌య‌న్ల కాలం నుంచే ఈ విత్త‌నాల‌ను వాడుతున్నార‌ని చ‌రిత్ర చెబుతోంది. చియా విత్త‌నాల‌కు నీళ్లు త‌గిలితే అవి త‌మ సైజుకు 10 రెట్ల ఆకారంలోకి తెల్ల‌ని జెల్‌లాగా మారుతాయి. అందువ‌ల్ల చియా విత్త‌నాల‌ను అద్బుత‌మైన పోష‌కాల‌కు నెల‌వు అని చెప్ప‌వ‌చ్చు. చియా విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.


జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు..
చియా విత్త‌నాల‌ను సూప‌ర్ ఫుడ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ విత్త‌నాల్లో మ‌న‌కు కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ఒక స‌ర్వింగ్‌.. అంటే 28 గ్రాముల చియా విత్త‌నాల‌ను తింటే మ‌న‌కు 138 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. 9 గ్రాముల కొవ్వులు, 12 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 11 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తాయి. ఈ విత్త‌నాల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. చియా విత్త‌నాల‌ను మ‌నం రోజూ అనేక విధాలుగా తీసుకోవ‌చ్చు. ఈ విత్తనాల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపున తింటే మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. ఈ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు అనేక విధాలుగా మేలు చేస్తాయి. చియా విత్త‌నాల‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌ప‌రంగా అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. 

 

ఇంకా చదవండినయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్‌!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


శ‌క్తి స్థాయిలు..
ఉద‌యం పూట చియా విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. శ‌రీరంలో నీళ్లు అంత త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోవు. దీని వ‌ల్ల యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌సిపోరు. రోజంతా శ‌రీరంలోని శ‌క్తి స్థాయిలు అలాగే ఉంటాయి. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. క‌నుక ఉద‌యం చియా సీడ్స్‌ను తినాల్సి ఉంటుంది. చియా విత్త‌నాల‌ను నాన‌బెట్టిన నీళ్ల‌ను తాగినా కూడా ఎంతో ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. ఈ నీటిలో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.


అధిక బ‌రువుకు..
అధికంగా బ‌రువు ఉన్న‌వారు, బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు ఉద‌యం చియా సీడ్స్‌ను తింటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఉద‌యం చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా శ‌రీరంలోని కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఎక్కువ సేపు ఉన్న‌ప్ప‌టికీ ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇక చియా విత్త‌నాల‌ను ఉద‌యం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. చియా విత్త‌నాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గుండె పోటు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.


చియా విత్త‌నాల‌ను 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రి పూట నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం తినాలి. ఇలా రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున చియా విత్త‌నాల‌ను తింటుంటే ఎన్నో అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Health #ChiaSeeds #Benefits