అమ్మో.. డిసెంబర్ లో ఇన్ని రోజులు బ్యాంక్ లకు సెలవలా? సగం రోజులకు పైగా! ముందుగానే జాగ్రత్త పడండి!

Header Banner

అమ్మో.. డిసెంబర్ లో ఇన్ని రోజులు బ్యాంక్ లకు సెలవలా? సగం రోజులకు పైగా! ముందుగానే జాగ్రత్త పడండి!

  Wed Nov 27, 2024 11:00        Business

చరిత్ర కాల గర్భంలో మరో నాలుగు రోజుల్లో మరొక నెల కలిసిపోనున్నది. 2024లో డిసెంబర్ నెల ప్రారంభం కానున్నది. గతంతో పోలిస్తే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ఆన్ లైన్‌లోనే సాగినా కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. ప్రస్తుతం ప్రతి క్షణం ఎంతో విలువైనది. కనుక బ్యాంకు శాఖకు వెళ్లాలని భావించే వారు తాము వెళ్లే రోజు బ్యాంకులు పని చేస్తున్నాయా..? లేదా..? అన్న విషయం తెలుసుకుంటే సరైన ప్లానింగ్ చేసుకోవచ్చు.. డిసెంబర్ నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, జాతీయ సెలవులు, ప్రాంతీయ సెలవులతో కలిపి 17 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో సెయింట్ ఫ్రాన్సిస్ షావియర్, పా-తోగాన్ నెంజ్మింగా సంగ్మా, యూ సోసో థామ్ వర్ధంతి, గోవా విముక్తి దినోత్సవం, క్రిస్మస్ వేడుకలు, యూ కియాంగ్ నాంగ్ బాహ్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బ్యాంకులు పని చేయవు.

 

ఇంకా చదవండిఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

డిసెంబర్ నెలలో బ్యాంకుల సెలవులు ఎప్పుడెప్పుడంటే..?!
డిసెంబర్ 1 – ఆదివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 3 – మంగళవారం (సెయింట్ ఫ్రాన్సిస్ షావియర్ ఫీస్ట్ సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు).

డిసెంబర్ 8 – ఆదివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 12 – గురువారం (పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 14 – రెండో శనివారం 

డిసెంబర్ 15 – ఆదివారం

డిసెంబర్ 18 – గురువారం (యూ సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు).

డిసెంబర్ 19 – శుక్రవారం (గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 22 – ఆదివారం

డిసెంబర్ 24 – మంగళవారం (క్రిస్మస్ వేడుకల సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు).

డిసెంబర్ 25 – బుధవారం (క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 26 – గురువారం (క్రిస్మస్ వేడుకల సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు).

డిసెంబర్ 27 – శుక్రవారం (క్రిస్మస్ సెలవుల సందర్భంగా నాగాలాండ్ లో బ్యాంకులు పని చేయవు)

డిసెంబర్ 28 – నాలుగో శనివారం

డిసెంబర్ 29 – ఆదివారం

డిసెంబర్ 30 – సోమవారం (యూ కియాంగ్ నాంగ్ బాహ్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు

డిసెంబర్ 31 – మంగళవారం (నూతన సంవత్సరంతోపాటు లొసూంగ్, నామ్ సూంగ్ సందర్భంగా మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Business #Banks #Holidays #India #AndhraPradesh #AP #Telangana #TG