ఫెడరల్ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్న ఎలాన్ మస్క్ నిర్ణయాలు! వృథా ఖర్చులపై కఠిన చర్యలు!

Header Banner

ఫెడరల్ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్న ఎలాన్ మస్క్ నిర్ణయాలు! వృథా ఖర్చులపై కఠిన చర్యలు!

  Thu Nov 28, 2024 14:54        U S A

అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి డొనాల్డ్ ట్రంప్  విజయం తర్వాత అమెరికా రాజకీయాల్లో ఎలాన్ మస్క్  కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఇప్పటికే తన విధులు నిర్వర్తించడం ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల ఆయన చేసిన పోస్టు ఫెడరల్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్  టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ , భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ  సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత అమెరికా ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని.. ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులే లక్ష్యంగా ‘డోజ్' ప్రాజెక్టు రూపొందించామని అధికారులు పేర్కొన్నారు. ఈ శాఖను సమర్థంగా ముందుకుతీసుకువెళ్లి ప్రభుత్వ వ్యవస్థలో మస్క్, వివేక్ మార్పులు తెస్తారని తాను ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఏటా ప్రభుత్వం ఖర్చుపెడుతున్న 6.5 ట్రిలియన్ డాలర్లలో దుబారా, అవినీతిని అరికడతామన్నారు. ఫెడరల్ సంస్థలను పునర్నిర్మించి మస్క్, వివేక్ తన పాలనకు మార్గం సిద్ధంచేస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర వేయాలని వారిరువురిని ఆదేశించారు. బాధ్యతలు స్వీకరించకముందే మస్క్ ఆ పని మొదలుపెట్టారు. ఫేక్ జాబ్స్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. మూకుమ్మడి తొలగింపులకు పిలుపునిచ్చారు.


ఇంకా చదవండితుపానులా మారుతున్న పవన్ కళ్యాణ్.. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ! ఇది ఆరంభం మాత్రమే..



పర్యావరణ సంబంధిత విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి పేర్లు, వారి వివరాలతో ఉన్న పోస్టును షేర్ చేశారు. ఫెంటాసిల్ హ్యాండిల్లో తొలుత ఆ వివరాలు పోస్టు అయ్యాయి. దాంతో ఆ సిబ్బంది నెగెటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్నారు. చివరకు ఒకరు తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులను భయపెట్టేందుకే మస్క్ ఈ తరహా వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లె ఆరోపించారు. ఇది మస్క్ కు అలవాటైన మార్గమంటూ వ్యాఖ్యలు చేశారు. పొమ్మనలేక పొగబెట్టడం లేక నెక్ట్స్ మీరే అనే తరహాలో బెదిరించడమే ఇక్కడ కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఓ కార్యక్రమంలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తుందని దుయ్యబట్టారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే దాదాపు రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చని అన్నారు. దీనికోసం ట్రంప్ ప్రభుత్వం సమర్థత విభాగం కృషి చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చర్యలు కూడా అందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #america #fedaral #jobs #todaynews #flashnews #latestupdate