వాకింగ్‌లో ఎన్ని ర‌కాలు ఉంటాయో తెలుసా? మీకు ఏ వాకింగ్ సెట్ అవుతుంది?

Header Banner

వాకింగ్‌లో ఎన్ని ర‌కాలు ఉంటాయో తెలుసా? మీకు ఏ వాకింగ్ సెట్ అవుతుంది?

  Thu Nov 28, 2024 14:55        Health

మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత సుర‌క్షిత‌మైన‌, అస‌లు ఖ‌ర్చు లేని వ్యాయామాల్లో వాకింగ్ ఒక‌టి. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా స‌రే వాకింగ్ చేయ‌వ‌చ్చు. రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాస్త‌వానికి వాకింగ్‌లోనూ చాలా ర‌కాలు ఉంటాయి. ఒక్కో ర‌క‌మైన వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలోని భిన్న అవ‌య‌వాల‌కు భిన్న‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి. అయితే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు ఏ ర‌క‌మైన వాకింగ్ సెట్ అవుతుందో దాన్ని చేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. ఇక వాకింగ్ లో ఎన్ని ర‌కాలు ఉంటాయో, ఏ త‌ర‌హా వాకింగ్‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

బ్రిస్క్ వాకింగ్‌..
వేగ‌వంత‌మైన న‌డ‌క‌ను బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ వాకింగ్‌లో చేతుల‌ను గ‌ట్టిగా ఊపుతూ గంట‌కు క‌నీసం 3 నుంచి 4 మైళ్ల వేగంతో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే బ్రిస్క్ వాకింగ్‌గా చెబుతారు. ఈ త‌ర‌హా వాకింగ్‌ను రోజూ 30 నిమిషాల పాటు చేస్తే బీపీ త‌గ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. హృద‌య సంబంధిత వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ వాకింగ్‌ను రోజూ చేయాల్సిన ప‌నిలేదు. వారంలో క‌నీసం 5 సార్లు చేసినా చాలు, దీంతో ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ఉంటుంది. కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు ఎక్కువ‌గా ఉన్న‌వారు, షుగ‌ర్ ఉన్న‌వారు ఈ వ్యాయామం చేస్తే మంచిది. 

 

ఇంకా చదవండిఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ప‌వ‌ర్ వాకింగ్‌..
ఇక బ్రిస్క్ వాకింగ్‌నే ఇంకాస్త వేగంగా చేయాల్సి ఉంటుంది. అంటే గంట‌కు 5 మైళ్ల వేగంతో వాకింగ్ చేయాలన్న‌మాట‌. అలాగే చేతుల‌ను కూడా ఇంకాస్త వేగంగా ఊపాల్సి ఉంటుంది. దీన్నే ప‌వ‌ర్ వాకింగ్ అంటారు. ప‌వ‌ర్ వాకింగ్ వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చవుతాయి. అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారికి ప‌వర్ వాకింగ్ ఎంత‌గానో మేలు చేస్తుంది. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శ‌రీరంలోని కొవ్వు త్వ‌ర‌గా క‌రిగిపోతుంది. ఈ వ్యాయామాన్ని కూడా వారంలో 5 రోజుల పాటు చేస్తే స‌రిపోతుంది. 2 రోజులు విశ్రాంతి తీసుకోవ‌చ్చు. 

 

ట్రెయిల్ వాకింగ్‌..
ప్ర‌కృతి కాసేపు వాకింగ్ చేస్తూ కాసేపు రెస్ట్ తీసుకోవ‌డాన్ని ట్రెయిల్ వాకింగ్ అంటారు. దీని వ‌ల్ల శ‌రీరానికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ఈ త‌ర‌హా వాకింగ్‌ను రోజూ చేయ‌వ‌చ్చు. ఇక చిన్న‌పాటి పొడ‌వైన స్టిక్స్ స‌హాయంతో న‌డ‌వ‌డాన్ని నోర్డిక్ వాకింగ్ అంటారు. దీని వ‌ల్ల శ‌రీరంలోని పైభాగానికి కూడా స‌పోర్ట్ ల‌భిస్తుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి. వ‌య‌స్సు మీద ప‌డిన‌వారు, బ్యాలెన్స్ స‌రిగ్గా లేనివారు లేదా స‌ర్జ‌రీలు అయిన వారు స్టిక్స్ స‌హాయంతో ఈ వాకింగ్ చేయ‌వ‌చ్చు. దీంతో త్వ‌ర‌గా కోలుకుంటారు. 

 

బ్యాక్ వార్డ్స్ వాకింగ్‌..
సాధారణ వాకింగ్‌కు బ‌దులుగా వెన‌క్కి కూడా న‌డ‌వవ‌చ్చు. దీన్నే బ్యాక్‌వార్డ్స్ వాకింగ్ అంటారు. దీని వ‌ల్ల శ‌రీర భంగిమ స‌రిగ్గా ఉంటుంది. బ్యాలెన్స్ అదుపులోకి వ‌స్తుంది. వెన్నెముక కండ‌రాలు దృఢంగా మారి వెన్నుకు స‌పోర్ట్ ల‌భిస్తుంది. వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే చెప్పుల్లేకుండా కూడా న‌డ‌వ‌వ‌చ్చు. ఇలా ప్ర‌కృతిలో ప‌చ్చ‌గ‌డ్డి మీద న‌డ‌వాల్సి ఉంటుంది. దీంతో అరికాళ్ల‌లో ఉండే ప‌లు నాడుల‌కు భూమి ఆక‌ర్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో శ‌రీరంలోని ప‌లు నాడులు యాక్టివేట్ అవుతాయి. దీంతో ప‌లు ర‌కాల వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా ప‌లు ర‌కాల వాకింగ్‌ల‌లో మీకు కావ‌ల్సిన వాకింగ్‌ను చేసి దాంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



   #AndhraPravasi #Health #Walking #Diet #Jogging