రోజూ బీరు తాగుతున్నారా? మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Header Banner

రోజూ బీరు తాగుతున్నారా? మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

  Thu Nov 28, 2024 20:07        Life Style

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. కానీ బీరు తాగితే నో ప్రాబ్లం..! అంటుంటారు కొందరు. ఇందులోనూ కొంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి బీరు కూడా మంచిది కాదని మరి కొందరు చెబుతుంటారు. అయితే తక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని, అధికంగా తాగితే ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 'ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్'లో పబ్లిషైన ఓ అధ్యయన సారాంశం ప్రకారం బీరు మితంగా తాగితే హెల్త్ బెనిఫిట్స్, అతిగా తాగితే ఆరోగ్య పరమైన నష్టాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

 

ఇంకా చదవండిఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక! 

 

అధికంగా తాగితే కలిగే నష్టాలు
బీరు అతిగా తాగితే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో తాగడంవల్ల కాలేయం దెబ్బతింటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. చలికాలంలో తరచుగా తాగడంవల్ల మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తవచ్చు. అంతే కాకుండా శరీరంలో కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. నడుము చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, పొట్ట పెరగడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మితంగా తాగితే కలిగే ప్రయోజనాలు
బీరును మితంగా, అంటే.. రోజూ ఒక టీ కప్పు పరిమాణంలో తాగడంవల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఎముకల సాంద్రతను పెంచుతుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా బీరులో పాలీ ఫెనాల్స్, అమైనో యాసిడ్స్, విటమిన్లు కూడా ఉంటాయి. మితంగా తీసుకోవడంవల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం మూలంగా తక్కువ మోతాదులో బీరు తాగడంవల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే యాక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది. బీరులో విటమిన్ బి1, బి2, బి6, బి9, బి12, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. మితంగా తాగితే ఇవి బాడీలో ఎనర్జీ లెవల్స్ పెరగడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి దోహద పడతాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



   #AndhraPravasi #LifeStyle #Alcohol #Beer #Drinks