ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం! మరికొన్ని రోజులు వర్షాలే!

Header Banner

ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం! మరికొన్ని రోజులు వర్షాలే!

  Tue Dec 03, 2024 14:36        Environment

ఫెంగల్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పై కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం తుఫాన్ తీరం దాటింది. అయితే, రాష్ట్రంలో మంగళవారం కూడా పలుచోట్ల వర్షం కురిసింది. ఒంగోలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు జలమయంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఒంగోలులో బస్టాండ్ కూడలి, కర్నూల్ రోడ్డులో భారీగా వర్షపునీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాగుల ఉద్ధృతి పెరిగింది. మద్దెలవంక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దేవళంపేట - వెదురుకుప్పం ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. మరోవైపు, ఫెంగల్ తుఫాన్ ప్రభావం తగ్గిందనుకునే లోపే వాతావరణ శాఖ ఏపీకి మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తమిళనాడును ఆనుకుని ఏర్పడే ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడం, ఐఎండీ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులుచేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert