ట్రంప్ ఆఫర్ ను వదులుకున్న మరో అధికారి..! చాడ్ క్రోనిస్టర్ DEA ఎంపికపై కీలక మలుపు!

Header Banner

ట్రంప్ ఆఫర్ ను వదులుకున్న మరో అధికారి..! చాడ్ క్రోనిస్టర్ DEA ఎంపికపై కీలక మలుపు!

  Wed Dec 04, 2024 12:53        U S A

డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) బాధ్యతలు చాడ్ క్రోనిస్టర్ (Chad Chronister)కు అప్పగిస్తున్నట్లు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేనని చాడ్ క్రోనిస్టర్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలకు నన్ను ఎంపిక చేయడం నా జీవితానికి ఎంతో గౌరవమైనది. కానీ, ఈ నామినీ నుంచి నేను గౌరవప్రదంగా తప్పుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి పౌరుల కోసం నేను చేయాల్సింది చాలా ఉంది. అమెరికన్ ప్రజల మద్దతును నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అని రాసుకొచ్చారు. ట్రంప్ ప్రతినిధి బృందం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!



మరోవైపు.. డీఈఏ బాధ్యతలను చాడ్ క్రోనిస్టర్కు అప్పగిస్తున్నట్లు ట్రంప్ (Trump) ఇటీవలే ప్రకటించారు. ఈక్రమంలో ట్రంప్ మద్దతుదారులే క్రోనిస్టర్ ఎంపికను తప్పుబట్టారు. 2020లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఓ పాస్టర్ను ఆయన అరెస్టు చేయడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయనకు తగిన అనుభవం ఉన్నప్పటికీ ఈ పదవికి అర్హులు కారని వాదించారు. ఈ క్రమంలోనే తాను బాధ్యతలను స్వీకరించనని క్రోనిస్టర్ ప్రకటించడం గమనార్హం. ఫ్లోరిడా అటార్నీ జనరల్గా కాంగ్రెస్ మాజీ సభ్యుడు మాట్ గేట్జ్ (Matt Gaetz)ను ట్రంప్ ఎంపిక చేశారు. అయితే, ఆయనపై పలు లైంగిక ఆరోపణలు రావడంతో గేట్జ్ తన పేరును ఉపసంహరించుకున్నారు. అనంతరం పామ్ బోండికి ఆ పదవిని అప్పగించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #drugenforcement #adminstrative #chadchronister #todatnews #flashnews #latestupdate #trump #amerixa #usa