అమెరికా ఆంక్షలకు చైనా కట్టుదిట్టంగా ప్రతిస్పందన! అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేత!

Header Banner

అమెరికా ఆంక్షలకు చైనా కట్టుదిట్టంగా ప్రతిస్పందన! అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేత!

  Wed Dec 04, 2024 12:14        U S A

చైనా (China) లోని కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా (USA) ఆంక్షలు విధించిన కొన్ని గంటల్లోనే బీజింగ్ తీవ్రంగా స్పందించింది. అరుదైన మూలకాలతో తయారుచేసే వస్తువును అమెరికాకు ఎగుమతి చేయకూడదని బ్యాన్ విధించింది. ముఖ్యంగా సైనిక, పౌర అవసరాలకు వినియోగించే గాలియం, జెర్మేనియం, యాంటీమోనీ, సూపర్ హార్డ్ పదార్థాలకు ఈ నిషేధం వర్తించనుంది. ఇక గ్రాఫైట్ ఎగుమతుల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. తమ దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. అమెరికా జాతీయ భద్రతను సాకుగా చూపి.. ఆర్థిక, వాణిజ్య, టెక్ అంశాలను ఆయుధాల వలే వాడుతోందని చైనా ఆరోపించింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!



అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్న వేళ చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త ఆంక్షల జాబితాలో ఉన్నవాటిని ఎగుమతి చేసే సంస్థలు ఇక కచ్చితంగా వాటి అంతిమ వినియోగదారు పేరును ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో అమెరికా ఆయుధ తయారీ సంస్థల్లో చైనాపై ఆధారపడిన వాటిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల అన్వేషణలో చైనా చాలా ముందుంది.
తాజాగా అమెరికా దాదాపు 24 రకాల సెమీకండక్టర్ తయారీ పరికరాలు, మూడు రకాల సాఫ్ట్వేర్ టూల్స్ను చైనాకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించింది. ఇవన్నీ చిప్స్ తయారీకి వినియోగిస్తారు. దీంతోపాటు చైనా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్నాయంటూ మరో 140 కంపెనీలను అగ్రరాజ్యం బ్లాక్ లిస్ట్లో చేర్చింది. జెర్మేనియం అనేది జింక్, కోల్ ఫ్లైయాష్ ఉపఉత్పత్తి. దీనిని చైనానే అత్యధికంగా 60శాతం ఎగుమతి చేస్తుంది. ఆ తర్వాత స్థానంలో కెనడా, ఫిన్లాండ్, రష్యా, అమెరికా ఉన్నాయి. ఇక గాలియంను జింక్, బ్లాక్సైట్ ఖనిజ ఓర్లో లభిస్తుంది. ఇది 80శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #china #computerchips #export #banned #transport #graphite #export #todaynews #flashnews #latestupdate