ముంచుకొస్తున్న మరో ముప్పు! ప్రాణాంతకంగా మారుతున్న బ్లీడింగ్ ఐ వైరస్!

Header Banner

ముంచుకొస్తున్న మరో ముప్పు! ప్రాణాంతకంగా మారుతున్న బ్లీడింగ్ ఐ వైరస్!

  Tue Dec 03, 2024 15:24        Health

కరోనా మహమ్మారి సృష్టించిన మారణ హోమాన్ని మర్చిపోకముందే మరో ముప్పు తరుముకొస్తోంది. అత్యంత ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీ అయిన రువాండాలో విధ్వంసం సృష్టిస్తోంది. దీని బారిన పడి ఇప్పటికే 15 మంది మరణించారు. వందలాది మందికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిక జారిచేసింది. మార్బర్గ్ వైరస్ సోకితే బాధితుల కళ్ల నుంచి రక్తం కారడం ప్రారంభం అవుతుంది. దీని కారణంగానే ఈ వైరస్ కు బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. కాగా ఈ వైరస్ను మొదటిసారి 1961లో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో కనుగొన్నారు.

 

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. మార్బర్గ్ వైరస్ ఎబోలా ఫ్యామిలీకి చెందినది. ఇది వైరల్ హెమరేజిక్ ఫీవర్ కు కారణం అవుతుంది. ఇది సోకిన తర్వాత రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతర్గత రక్త స్రావానికి, ముఖ్యంగా కళ్లల్లో రక్తం కారడానికి కారణం అవుతుంది. కాగా ఇది జూనోటిక్ వైరస్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మొదట గబ్బిలాల నుంచి ఉద్భవిస్తుంది. వాటి యూరిన్, లాలా జలం లేదా రక్తం ద్వారా కూడా మానవులకు వ్యాపిస్తుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మార్బర్గ్ వైరస్ లక్షణాలు కూడా ఎబోలా వైరస్ మాదిరిగానే ఉంటాయి. ఇది సోకిన తర్వాత బాధిత వ్యక్తుల్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, శరీరంపై దద్దుర్లు వంటివి కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువై అంతర్గత రక్త స్రావం, అవయవ వైఫల్యం సంభవిస్తాయి. ఆకస్మికంగా బరువు తగ్గడం, ముక్కు, కళ్లు, నోరు లేదా మహిళల్లో అయితే యోని నుంచి రక్త స్రావం అయ్యే అవకాశం ఉంటుందని డబ్ల్యుహెచ్ఓ ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

 

నిపుణుల ప్రకారం.. మార్బర్గ్ వైరస్ కు కచ్చితమైన ట్రీట్మెంట్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు. కాగా దీని డెత్ రేట్ 24 నుంచి 88 శాతం వరకు ఉండవచ్చునని పేర్కొంటున్నారు. లక్షణాల ఆధారంగా అందుబాటులో ఉన్న సాధారణ చికిత్సలను అందిస్తారు. కాగా వ్యాక్సిన్ తయారీ కూడా ప్రాథమిక దశలో ఉన్నట్లు చెబుతున్నారు. మార్బర్గ్ వైరస్ సోకిన బాధితులతో లైంగి చర్యల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. లాలాజలం, ఇతర శరీర ద్రవాల ద్వారా కూడా ఇతరులకు సోకుతుంది. కాబట్టి ఈ వైరస్ బాధితులకు దూరం పాటించాలని, కరోనా టైమ్ లో మాదిరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులుచేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Virus #Eyes #Covid