భారతీయులకు థాయ్‌లాండ్‌ గుడ్‌న్యూస్‌! పర్యాటకులకు మరికొద్దిరోజులు వీసా ఫ్రీ ఎంట్రీ!

Header Banner

భారతీయులకు థాయ్‌లాండ్‌ గుడ్‌న్యూస్‌! పర్యాటకులకు మరికొద్దిరోజులు వీసా ఫ్రీ ఎంట్రీ!

  Thu Dec 12, 2024 19:13        Travel

భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్‌ శుభవార్త చెప్పింది. ఆ దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ గడువును పొడిగించింది. భారతీయులకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని నిరవధికంగా పొడిగించింది. గతంలో నవంబర్‌ 11 వరకు వీసా ఫ్రీ ఎంట్రీ గడువు ఇచ్చింది. ప్రస్తుతం మరో రెండునెలలు పొడిగించింది. దాంతో మరో రెండునెలల పాటు థాయ్‌లాండ్‌లోనే వీసా లేకుండా ఉండొచ్చు. టూరిజం అథారిటీ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. భారతీయ పౌరులు వీసా లేకుండా 60 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండవచ్చని పేర్కొంది.

 

ఇంకా చదవండివైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను! 

 

భారతీయ పౌరులు ఇంతకంటే ఎక్కువ సమయం ఉండాలనుకుంటే ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి మరో 30 రోజుల గడువును పొడిగించు కోవచ్చని పేర్కొంది. ఇక థాయ్‌లాండ్‌లో ప్రముఖ బీచ్‌లు ఉన్నాయి. ఫై ఫై ఐలాండ్, ఫుకెట్, క్రాబీ, కోరల్ ఐలాండ్, పట్టాయా బీచ్‌లకు ప్రసిద్ధి. ఈ బీచ్‌లలో ఎంజాయ్‌ చేయొచ్చు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఈ బీచ్‌లకు వస్తుంటారు. అదే సమయంలో సన్‌సెట్‌ సైతం అద్భుతంగా ఉంటుంది. థాయ్‌లాండ్ బీచ్‌లతో పాటు చారిత్రక ఆలయాలు సైతం ఉన్నాయి. వాస్తు నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇందులో పట్టాయాలో ఉన్న ‘సెంచరీ ఆఫ్ ట్రూత్’, ‘అయుతయ’, ‘వైట్ టెంపుల్’, ‘ది గ్రాండ్ ప్లేస్’ ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడురేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

  

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

    

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #Thailand #Tourism #World