ఘాట్ రోడ్డులో జారిపడిన బండరాళ్ళు...తితిదే ప్రత్యేక చర్యలు! రాకపోకలను నిలిపివేత!

Header Banner

ఘాట్ రోడ్డులో జారిపడిన బండరాళ్ళు...తితిదే ప్రత్యేక చర్యలు! రాకపోకలను నిలిపివేత!

  Thu Dec 12, 2024 18:51        Others

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం థాటికి ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్డులోని హరిణికి సమీపంలో జారిపడిన బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ఘాట్రోడ్డులో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తితిదే అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలను నిలిపివేసింది. రెండు ఘాట్రోడ్లలో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసింది. వర్షం కారణంగా శ్రీవారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వర్షానికి కొండపై చలి తీవ్రత పెరిగింది. దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్ళే భక్తులు తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. సీఆర్వో వద్ద గదులు పొందే భక్తులు వర్షానికి అవస్థలు పడుతున్నారు. పాపవినాశనం జలశయాం నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

 

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #thirupathi #hills #rains #heavyrains #roadsblock #todaynews #flashnews #latestupdate