ఎలాన్ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారా? ట్రంప్‌ సమాధానం ఇదే!

Header Banner

ఎలాన్ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారా? ట్రంప్‌ సమాధానం ఇదే!

  Mon Dec 23, 2024 12:43        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్‌ విజయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో తన గెలుపునకు దోహదపడ్డ మస్క్‌కు ట్రంప్‌ తన క్యాబినెట్‌లో సముచిత స్థానం కల్పించారు. ‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక ట్రంప్‌ 2.0లో మస్క్‌ పాత్ర కీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అదే సమయంలో మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతాడా..? అంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా డెమోక్రటిక్‌ పార్టీ నేతలు ‘ప్రెసిడెంట్‌ మస్క్‌’ అంటూ ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాకు మస్క్‌ అధ్యక్షుడు అవుతాడంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్యానించారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌ తొలిసారి అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్‌ అంశంపై మాట్లాడారు. ‘ఎలాన్‌ మస్క్‌ ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడు. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే.. ఆయన అమెరికాలో పుట్టలేదు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కానీ, మస్క్‌.. దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వసల వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants