ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
Mon Dec 23, 2024 18:59 Politicsభవన నిర్మాణాల కోసం ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులన్నీ ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వరదనీరు, ఘనవ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాతపన్ను బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆచార్య నాగార్జున వర్సిటీలో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. దీనికి 123 మంది పురపాలక కమిషనర్లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు, కాకినాడ, రాజమండ్రిలో ఘనవ్యర్థాల నిర్వహణకు అనుమతి వచ్చిందన్నారు.
ఇంకా చదవండి: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో చెత్త సమస్య పరిష్కారమవుతోందని చెప్పారు. 2014-2019 మధ్య మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ సమయంలో మున్సిపల్ పన్నులు రూపాయి కూడా పెంచలేదు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించింది. ప్రస్తుతం పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. సీఎఫ్ఎంఎస్లో సంబంధం లేకుండా మున్సిపాలిటీలకే నిధులు కేటాయిస్తాం. 123 మున్సిపాలిటీలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖలో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విధానంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతాం. వివిధ రాష్ట్రాలు మన నిర్మాణ సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి” అని నారాయణ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్.. వారికి పంటల బీమా పథకాలు!
ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!
దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!
డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..
అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!
ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss
వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..
అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #constructions #floors #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.