కడప కార్పొరేషన్‌లో రచ్చరచ్చ! ఎమ్మెల్యే, మేయర్‌ మధ్య మాటల యుద్ధం!

Header Banner

కడప కార్పొరేషన్‌లో రచ్చరచ్చ! ఎమ్మెల్యే, మేయర్‌ మధ్య మాటల యుద్ధం!

  Mon Dec 23, 2024 13:19        Politics

కడప నగరపాలక సంస్థలో మేయర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే మధ్య రచ్చ కొనసాగుతోంది. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ కేటాయించకపోవడంతో కొన్ని వారాలుగా వివాదం కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ టీడీపీ ఎమ్మెల్యే మాధవికి మేయర్‌ కుర్చీ వేయలేదు. దీంతో మరోసారి కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమావేశం జరగకుండా టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. 

 

సర్వసభ్య సమావేశంలో వేదికపై మేయర్‌ సురేశ్‌ బాబుకు మాత్రమే కుర్చీ వేయడంతో.. తనకు సీటు లేకపోవడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస తెలిపారు. అంతకుముందు భారీగా అనుచరులతో ఆమె ర్యాలీగా కడప కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద టీడీపీ నాయకులను పోలీసులు అడ్ఉడకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మేయర్ సురేశ్‌ బాబు, ఎమ్మెల్యే మాధవి రడ్డి మధ్య కుర్చీలాట కొనసాగింది. వేదికపై ఎమ్మెల్యేకు సీటు వేయాలని ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. గత సమావేశంలోనూ పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. ఎంతకీ వివాదం సద్దుమణగకపోవడంతో సభ వాయిదా పడింది. మహిళను గౌరవించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. అంతకుముందు మేయర్ పోడియాన్ని ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ మద్దతు కార్పొరేటర్లు చుట్టుముట్టారు.

 

ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం
మేయర్ సురేశ్‌బాబుకు మహిళలంటే చిన్నచూపు ఉందని.. అందుకే మహిళలను నిలబెట్టారు అని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో కుడి.. ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారని గుర్తుచేసుకున్న ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టకపోవడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషపడవచ్చేమో.. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు అని చెప్పారు. మేయర్ కుర్చీలాట ఆడుతున్నారని.. విచక్షణాధికారం ఉందని విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని మాధవి ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP