జగన్ హయాంలో వైకాపా నేతల పబ్బం గడిచిందా? ఫైబర్నెట్‌లో దుర్వినియోగం పై కఠిన చర్యలు!

Header Banner

జగన్ హయాంలో వైకాపా నేతల పబ్బం గడిచిందా? ఫైబర్నెట్‌లో దుర్వినియోగం పై కఠిన చర్యలు!

  Wed Dec 25, 2024 10:41        Politics

గత ప్రభుత్వంలో అర్హతలతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్నెట్లో నియమితులైన 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. నియామకపత్రాలేవీ లేకుండా వారు సంస్థలో చేరినట్లు పరిశీలనలో గుర్తించామన్నారు. ఇలాగే మరో 200 మంది ఉన్నట్లు సమాచారం ఉందని.. వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు.. విజయవాడలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. “సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయి. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసినవారికి ఫైబర్నెట్ నుంచి వేతనాలు చెల్లించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలుచేసే అవకాశం ఉన్నా.. చిన్న ఉద్యోగులనే ఉదారత చూపిస్తున్నాం” అని తెలిపారు. గత ఐదేళ్లలో సంస్థ పేరిట బ్యాంకుల నుంచి రూ.1,260 కోట్లు, గుత్తేదారులకు రూ.900 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి సంస్థను ఆర్థికంగా దివాలా స్థాయికి తెచ్చారన్నారు.



ఇంకా చదవండిఅమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!



అప్పటి ఎండీకి లీగల్ నోటీసులు
సిబ్బంది అక్రమ నియామకాలపై అప్పటి ఎండీ మధుసూదన్రెడ్డికి షోకాజ్ నోటీసు.. లీగల్ నోటీసులు పంపనున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. "జీతాల చెక్కులపై ఆయనే సంతకం చేశారు. అంతటికీ ఆయనే బాధ్యుడు. ఆయన సమాధానాన్ని పరిశీలించి, తదుపరి చర్యలపై ముందుకు వెళ్తాం. ఆయన ఆస్తుల వివరాలు, సంస్థ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపద తదితర అంశాలపై అవసరమైతే విచారణ కోరతాం" అని పేర్కొన్నారు.
వర్మకు చెల్లించిన మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
వ్యూహం సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు సంస్థ నుంచి రూ.1.15 కోట్లు అక్రమంగా చెల్లించారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. “ఆ మొత్తాన్ని చెల్లించేందుకు 15 రోజుల గడువు ఇచ్చాం. ఇదే విషయాన్ని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నాం. డబ్బు చెల్లించకుంటే వర్మపై కేసు నమోదు చేస్తాం. ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయంలోనే స్పష్టత లేదు. చంద్రబాబు, లోకేశ్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఎన్నికల ముందు ప్రయత్నించారు” పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #jagan #scams #fibernet #todaynews #flashnews #latestupdate