చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి!

Header Banner

చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి!

  Wed Dec 25, 2024 11:57        Health

సీజన్‌ మారుతున్నకొద్దీ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి. మీరు విపరీతమైన అలసటకు గువుతారు. ఈ సీజ‌న్‌లో మన ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కూడా త‌గ్గుతుంది కాబట్టి అవి అంత తొందరగా తగ్గవు. పైగా జలుబు, దగ్గు కారణంగా ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దీనివల్ల ఏ పని మీద ఫోకస్‌ చేయలేం. ఎన్ని రకాల ఇంగ్లిష్‌ మందులు వాడినా తగ్గవు. దీర్ఘకాలం వేధిస్తూనే ఉంటాయి. అయితే, వంటింట్లో దొరికే కొన్ని వస్తువలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి చాలా తొందరగా ఉపశమనం పొందొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం..

 

అల్లం 
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి దగ్గు నివారణకు అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లం చిన్న ముక్కలుగా కట్‌ చేసి రోజూ ఒక గంట పాటు తినడం వల్ల కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలా తినలేకపోతే మనం రోజూ తాగే ఒక కప్పు టీలో కాస్త అల్లంను వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

 

నిమ్మరసం.. 
ఈ సీజ‌న్‌లో వ‌చ్చే అన్ని స‌మ‌స్యల‌కు చెక్ పెడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు నిమ్మర‌సం తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఉద‌యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మర‌సం క‌లిపి తాగితే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చని చెబుతున్నారు.

 

తేనె 
దగ్గుకు తేనె మంచి రెమెడీ అని చెప్పొచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు ఉంటాయి. అలాగే నియాసిన్‌, రైబోఫ్లోవిన్‌ వంటి మూలకాలను కలిగి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే ఒక స్పూన్‌ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం లేదా నిమ్మరసం జోడించి తీసుకోవచ్చు.

 

విటమిన్‌ సి
నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు రావడం తగ్గుతాయి.

 

పసుపు 
దగ్గు, జలుబు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌, యాంటీవైరల్‌ లక్షణాలు కఫాన్ని తగ్గిస్తాయి.

 

ఇంకా చదవండిఅమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం 
ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది గొంతు నొప్పి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా వేడి నీటితో ఆవిరిపట్టుకోవడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల శ్వాస బాగా ఆడి ఉపశమనం లభిస్తుంది.

 

సూప్‌లు 
చలికాలం ఏదైనా వేడివేడిగా తాగాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు సూప్‌లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. సూప్‌లు చలి తీవ్రతను తగ్గించి త్వరగా కోలుకునేలా చేస్తాయి. అవి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాదు మీ రోగనిరోధక వ్యవస్థను పెంచే అవసరమైన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. సూప్‌లతోపాటు వేడి పానీయాలను కూడా తీసుకోవడం మంచిది. వేడి పానీయాలు తాగడం వల్ల ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదండోయ్‌ గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.

 

బెల్లం 
బెల్లంలో ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలకమైనరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. పొడి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

 

తులసి – తమలపాకు 
తమలపాకులో కూడా యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దగ్గును రాకుండా చేయడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి. అవసరమైతే తులసిని నీళ్లలో వేసి మరగించి కషాయంలా కూడా తీసుకోవచ్చు.

 

వాము 
రాత్రిపూట పొడిదగ్గు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు చిటికెడు వామును చేతిలో నలిపి.. దవడకు పెట్టుకుని కాసేపు చప్పరించాలి. దీనివల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.

 

దాల్చిన చెక్క 
దాల్చిన చెక్కలో వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ను ఎదుర్కొనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇవి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనే కలిపి.. రోజుకు రెండు మూడుసార్లు చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Health #Winter #Seasons #Climate #Weather