అత్యధిక జీతం... అతి తక్కువ ఒత్తిడి! 2025లో టాప్-10 ఉద్యోగాలు ఇవే!

Header Banner

అత్యధిక జీతం... అతి తక్కువ ఒత్తిడి! 2025లో టాప్-10 ఉద్యోగాలు ఇవే!

  Wed Dec 25, 2024 12:56        Employment

కొత్త ఏడాదికి హాయ్ చెప్పే క్షణాలు సమీపిస్తున్నాయి. నూతన సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని, ఉద్యోగం-జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకునేవారు ఎందరో. అలాంటి వారందరూ ఆర్థిక భద్రతతోపాటు మానసిక ఒత్తిళ్లు లేని ఉద్యోగాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. చాలామంది ఇప్పటికే ఆ పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉద్యోగాల జాబితాను రెజ్యుమె బిల్డర్ సంస్థ ‘రెజ్యుమె జీనియస్’ ఈ నెల 16న రిలీజ్ చేసింది. అత్యధిక వేతనం ఇవ్వడంతోపాటు తక్కువ ఒత్తిడి ఉండే ఆ ఉద్యోగాలు ఏవో చూసేద్దామా? 

 

వాటర్ సోర్స్ స్పెషలిస్ట్
ఈ ఉద్యోగం ప్రారంభ వేతనం ఏడాదికి దాదాపు రూ. 1.3 కోట్లు. 2023లో 1,00,100 ఉద్యోగాలు ఉండగా వచ్చే పదేళ్లలో 8 శాతం పెరుగుతాయని అంచనా. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. రీజినల్, మున్సిపల్ వాటర్ సరఫరాను నిత్యం పర్యవేక్షిస్తూ శుభ్రంగా, స్థిరంగా నిర్వహించాల్సి ఉంటుంది. 

 

ఖగోళ శాస్త్రవేత్తలు
ఖగోళ శాస్త్రవేత్తలకు మధ్యస్థంగా ఏడాదికి రూ. 1.2 కోట్ల వరకు వేతనం లభిస్తుంది. 2023లో 23,500 ఉద్యోగాలు ఉండగా వచ్చే పదేళ్లలో ఏడు శాతం పెరుగుతాయని అంచనా. డాక్టోరల్, లేదంటే ప్రొఫెషనల్ డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగం సంపాదించవచ్చు. నక్షత్రాలు, గ్రహాలు, అంతరిక్షానికి సంబంధించిన ఇతర పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా వీరి ఉద్యోగం పరిశోధనే. 

 

యాక్చురీస్ (బీమా గణికులు)
వీరికి ఏడాదికి కోటి రూపాయల వరకు వేతనం ఉంటుంది. గతేడాది 30,200 ఉన్న ఈ ఉద్యోగాలు వచ్చే దశాబ్ద కాలంలో 22 శాతం పెరిగే అవకాశం ఉంది. బ్యాచిలర్ డిగ్రీతో ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. యాక్చురీలు గణితం, గణాంకాలు, ఇతర ఆర్థిక డేటాను ఉపయోగించి ఆర్థిక నష్టాలను విశ్లేషిస్తారు. 

 

పర్యావరణ ఆర్థికవేత్తలు
వీరికి ఏడాదికి దాదాపు రూ. 98 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. నిరుడు 17,500 ఉన్న ఈ ఉద్యోగాలు వచ్చే పదేళ్ల కాలంలో ఐదు శాతం పెరుగుతాయని అంచనా. మాస్టర్స్ డిగ్రీ ఈ ఉద్యోగానికి అర్హత. పర్యావరణ ఆర్థికవేత్తలు సాధారణంగా ప్రభుత్వం, ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తారు. ప్రాజెక్టుల ఖర్చులు, ప్రయోజనాలను వీరు అంచనా వేస్తారు. 

 

ఇంకా చదవండిఅమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గణిత శాస్త్రవేత్తలు
గణిత శాస్త్రవేత్తలకు ఏడాదికి రూ. 89 లక్షల వరకు జీతం లభిస్తుంది. గతేడాది 34,800 జాబ్స్ ఉన్నాయి. వచ్చే దశాబ్దకాలంలో 11 శాతం పెరిగే అవకాశం ఉంది. మాస్టర్స్ డిగ్రీ కలిగిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. 

 

కంప్యూటర్ సిస్టం అనలిస్టులు
కంప్యూటర్ సిస్టం అనలిస్టులకు ఏడాదికి కనీసం రూ. 88 లక్షల వేతనం లభిస్తుంది. 2023లో 5.27 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ఇవి 11 శాతం పెరిగే అవకాశం ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఈ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. వ్యాపారులు ఎక్కువగా సాంకేతికను ఉపయోగించుకునేలా చేయడమే వీరి లక్ష్యం. అందుకు అనుగుణంగా వీరు సహాయసహకారాలు అందిస్తారు. అందుకు తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. 

 

ఫ్యూయల్ సెల్ ఇంజినీర్స్
వీరి వార్షిక వేతన దాదాపు రూ. 84 లక్షలు. గతేడాది 2.91 లక్షల ఉద్యోగాలు ఉండగా వచ్చే పదేళ్లలో 11 శాతం వృద్ధి కనిపించే అవకాశం ఉంది. బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. వాహనాలు, భవనాలు క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే సిస్టంను ఫ్యూయల్ సెల్ ఇంజినీర్లు డిజైన్ చేసి, అభివృద్ధి చేస్తారు. 

 

రిమోట్ సెన్సింగ్ సైంటిస్టులు, టెక్నాలజిస్టులు
వీరి వార్షిక వేతనం రూ. 79 లక్షల వరకు ఉంటుంది. 2023లో 26 వేల ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ఐదుశాతం పెరిగే అవకాశం ఉంది. గరిష్ఠంగా బ్యాచిలర్ డిగ్రీ చదువుకుని ఉంటే సరిపోతుంది. రిమోట్ సెన్సింగ్ సైంటిస్టులు, టెక్నాలజిస్టులు శాటిలైట్ డేటాను విశ్లేషించి క్లైమేట్ చేంజ్, అర్బన్ ప్లానింగ్ వంటి సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. 

 

భౌగోళిక శాస్త్రవేత్తలు
భౌగోళిక శాస్త్రవేత్తల వార్షిక వేతనం రూ. 77 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది. గతేడాది 1600 ఉద్యోగాలు మాత్రమే ఉండగా వచ్చే దశాబ్ద కాలంలో మూడు శాతం ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగానికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీరు చేయాల్సిందల్లా భూమి, దాని లక్షణాలు, దాని విస్తరణ, లక్షణాలు, నివాసితులు వంటివాటిని అధ్యయనం చేస్తారు. అర్బన్ ప్లానింగ్, విపత్తు నిర్వహణ వంటి వాటిని మెరుగుపరచడానికి పనిచేస్తారు. 

 

ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్స్
వీరికి ఏడాది రూ. 69 లక్షల వేతనం లభిస్తుంది. గతేడాది 2023 ఉద్యోగాలు ఉండగా వచ్చే పదేళ్లలో నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం పొందాలంటే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. వీరు వివిధ రకాల రవాణా సంబంధిత సమస్యలను పరిష్కరిస్తారు. అంటే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, నగరాలను బైక్ యాక్సెసిబుల్‌గా మార్చడం వీరి విధి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Employment #Jobs #Top10 #World