దుబాయ్ మెట్రో కీలక నిర్ణయం! 43 గంటల పాటు నాన్ స్టాప్ సేవలు!

Header Banner

దుబాయ్ మెట్రో కీలక నిర్ణయం! 43 గంటల పాటు నాన్ స్టాప్ సేవలు!

  Wed Dec 25, 2024 13:43        U A E

యూఏఈ: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో దుబాయ్ మెట్రో, ట్రామ్ డిసెంబర్ 31 నుండి 43 గంటలకు పైగా నాన్ స్టాప్ గా పనిచేస్తాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

 

దుబాయ్ మెట్రో కోసం.. డిసెంబర్ 31 ఉదయం 5 గంటల నుండి జనవరి 1 చివరి వరకు పనివేళలు ఉంటాయి. అదే సమయంలో దుబాయ్ ట్రామ్ డిసెంబర్ 31 ఉదయం 6 నుండి జనవరి 2 ఉదయం 1 గంటల వరకు పనిచేస్తుంది. ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండేలా 1,400 బస్సులను అందుబాటులో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రోడ్లు రవాణా అథారిటీ (RTA) ట్రాఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ అల్ బనా తెలిపారు. 

 

ఇంకా చదవండిఅమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ సాయంత్రం 5 గంటల నుండి మూసివేయబడుతుందని, ఉత్సవాలకు చేరుకోవడానికి సమీపంలోని మెట్రో స్టేషనన్ను ఉపయోగించాలని ఆయన సూచించారు. "ట్రాఫిక్ రద్దీలను నివారించడానికి దుబాయ్ మెట్రోను ఉపయోగించాలని మేము ప్రజలను కోరుతున్నాము. అన్ని మెట్రో స్టేషన్లు పనిచేస్తాయి. కొన్ని స్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. కొన్ని సమయాల్లో మేము రద్దీని నివారించడానికి బుర్జ్ ఖలీఫా వంటి కొన్ని స్టేషన్లను మూసివేస్తాము. మేము బిజినెస్ బే స్టేషన్పై ఆధారపడతాము." అని అల్ బనా వివరించారు.

 

దుబాయ్ పబ్లిక్ పార్క్లు రాత్రి 1 గంటల వరకు పనిచేస్తాయని దుబాయ్ మునిసిపాలిటీ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ టీమ్ హెడ్ అడెల్ మహ్మద్ అల్ మర్జాకి తెలిపారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఫైర్ వర్క్స్, డ్రోన్ ప్రదర్శన దుబాయ్ లోని మొత్తం 36 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ప్రధాన వేడుకలు బుర్జ్ పార్క్, గ్లోబల్ విలేజ్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, అల్ సీఫ్, బ్లూవాటర్స్, ది బీచ్ ఎట్ JBR, హట్టా లలో నిర్వహించనున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారాఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.లక్షల 20 వేల జీతంతో జాబ్అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates