కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు! ఈ రూట్‌లోనే.. లైన్ క్లియర్, ధరల వివరాలు!

Header Banner

కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు! ఈ రూట్‌లోనే.. లైన్ క్లియర్, ధరల వివరాలు!

  Sun Dec 29, 2024 11:15        Travel

భారతీయ రైల్వే సంస్థ నెమ్మదిగా వందేభారత్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రయాణీకులను వేగంగా తమ గమ్య స్థానాలకు చేర్చేలా సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. అందులో భాగంగానే పూణె నుంచి నాలుగు అదనపు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం, పూణె నుంచి రెండు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. మరో నాలుగు రైళ్లను చేర్చడంతో ప్రయాణీకులకు మెరుగైన సేవలు లభించనున్నాయి. కొత్త రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి. ప్రస్తుతం పూణె- హుబ్బల్లి, పూణె -కొల్హాపూర్,  ముంబై-సోలాపూర్ (పుణె మీదుగా) రూట్లలో రెండు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత  ఈ మార్గాల్లో ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పూణె నుంచి మరో 4 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని అధికారులు నిర్ణయించారు. ఈ రైళ్లు..  పూణె నుంచి షెగావ్, పూణె నుంచి వడోదర, పూణె నుంచి సికింద్రాబాద్, మరో రైలు పూణె నుంచి బెలగావి రూట్లలో నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రైళ్లు వీలైనంత త్వరగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.

 

ఇంకా చదవండి: అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

ఈ నాలుగు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే  పూణె నుంచి ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. మొత్తంగా పూణె నుంచి 6 వందేభారత్ రైళ్లు తమ సేవలను అందించనున్నాయి. పూణె -కొల్హాపూర్ రూట్‌ లో వన్‌ వే టికెట్ ధర రూ.560, ప్రత్యేక కోచ్‌ కు రూ.1,135 ఉంటుంది. రైల్వే షెడ్యూల్ ప్రకారం, ఈ రైలు బుధవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే నడుస్తుంది. పూణె-హుబ్బల్లి మార్గంలో స్టాండర్డ్ సీటుకు రూ. 1,530,  ప్రత్యేక కోచ్‌ కు రూ. 2,780గా టికెట్ ధర నిర్ణయించారు. ఇతర రూట్లకు సంబంధించి ఇంకా టికెట్ ధరలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వందేభారత్ రైళ్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024లో 30కి పైగా  వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. 2024 చివరి నాటికి మొత్తం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 136కి చేరుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలు, ప్రాంతాలను వందేభారత్ రైళ్లు కవర్ చేస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. తొలుత న్యూఢిల్లీ -శ్రీనగర్ రూట్ లో తొలి వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత 10 స్లీపర్ రైళ్లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

https://youtu.be/ELLbqGISlgo?si=4r8mjt_Kmnugobhu


   #AndhraPravasi #VandebharatSleepertrain #AndhraPradesh