సిగరెట్ తాగేవారికి షాకింగ్ న్యూస్! ఒక్కటి తాగితే ఆయుష్షు ఎంత తగ్గుతుందో తెలుసా?

Header Banner

సిగరెట్ తాగేవారికి షాకింగ్ న్యూస్! ఒక్కటి తాగితే ఆయుష్షు ఎంత తగ్గుతుందో తెలుసా?

  Wed Jan 01, 2025 16:03        Health

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అయినా కొందరు మాత్రం వాటిని మానేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సిగరెట్లను వదల్లేరు. అయితే సిగరెట్ తాగితే అనారోగ్యమే కాకుండా ఆయుష్షు కూడా తగ్గుతుందని డాక్టర్లు చెబుతూనే ఉంటారు. ఇక తాజాగా ఓ అధ్యయనం సంచలన విషయాలు వెలువరించింది. పురుషులు, మహిళలు ఒక్క సిగరెట్ తాగితే.. జీవితంలో ఎంత సమయం ఆయుష్షు కోల్పోతారు అనేది తేల్చింది. కొత్త ఏడాది అయినా ఈ అలవాటును మానుకోవాలని సూచించింది. 

 

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది డైలాగ్ మాత్రమే కాదు అక్షర సత్యం. ఇక ఇదే వాక్యం.. ప్రతీ సిగరెట్ ప్యాకెట్‌పైనా ముద్రించి ఉంటుంది. అలా ముద్రించాలని ప్రభుత్వాలు.. పొగాకు కంపెనీలకు విధించిన ఆదేశాలు కూడా. అయితే ఇలా ముద్రించినా, సిగరెట్లు తాగితే అనారోగ్యం బారిన పడతామని తెలిసినా.. పొగాకు ప్రియులు మాత్రం వాటిని వదలరు. కొందరు రోజుకు 2, 3 సిగరెట్లు తాగితే.. మరికొందరు చైన్ స్మోకర్లు మాత్రం నిత్యం పెట్టెలకు పెట్టెలు కాల్చేస్తూ.. తమ ఆరోగ్యాలను కూడా పాడు చేసుకుంటున్నారు. ఇక ఏదైనా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే.. ఊపిరితిత్తులు చెడిపోయాయని.. సిగరెట్లు పూర్తిగా మానేయాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా కొందరు పొగరాయుళ్లు మాత్రం వాటిని అస్సలు వదలరు. పురుషులే కాకుండా మహిళలు కూడా నోట్లో సిగరెట్లు పెట్టుకుని పొగను గాల్లోకి వదులుతున్నారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే సిగరెట్లు తాగేవారిపై తాజాగా నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఒక సిగరెట్ తాగితే మనిషి జీవిత కాలంలో సగటున 20 నిమిషాల ఆయుష్షును కోల్పోతాయని యూనివర్సిటీ కాలేజ్ లండన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో తెలిపింది. అయితే ఈ ఆయుర్దాయం కోల్పోవడం అనేది పురుషులు, మహిళలకు వేరువేరుగా ఉంటుందని పేర్కొంది. పురుషుల కంటే మహిళలు సిగరెట్లు తాగడం మరింత డేంజర్ అని వెల్లడించింది. పురుషులు ఒక సిగరెట్ తాగితే.. వారి జీవిత కాలంలో 17 నిమిషాల ఆయుష్షును తగ్గించుకున్నట్లేనని ఆ అధ్యయనం వెల్లడించింది. 

 

ఇక మహిళల విషయానికి వస్తే.. వారు ఒక సిగరెట్‌ తాగితే వారి జీవితకాలంలో 22 నిమిషాల సమయాన్ని కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే పొగ తాగేవారు ఈ అనారోగ్యకరమైన అలవాటును వీడటం ద్వారా 2025 కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టాలని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు సూచించారు. 

 

అయితే గతంలో సిగరెట్లు తాగేవారిపై, వారి జీవిత కాలంపై నిర్వహించిన ఎన్నో అధ్యయనాల కన్నా తాజాగా యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన అధ్యయనం ధూమపానం వల్ల నష్టపోయే జీవిత కాలం ఎక్కువని తేల్చడం గమనార్హం. ఇక 20 సిగరెట్లు ఉండే ఒక ప్యాకెట్‌ను ఒక రోజులో తాగితే.. మనిషి జీవితంలో సుమారుగా 7 గంటల జీవిత కాలం తగ్గించుకున్నట్లేనని ఆ అధ్యయనం వెల్లడించింది. ఇక తమ జీవిత కాలం పూర్తిగా మెరుగుపడాలని భావించే వారు ధూమపానాన్ని పూర్తిగా మానేయాలని ఆ అధ్యయనం తెలిపింది. ఇక ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం సుమారు 80 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే వెల్లడించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Health #Cigerette #Smoking #Smoke