యెమెన్ లో కేరళ నర్సుకు ఉరిశిక్ష! కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు!

Header Banner

యెమెన్ లో కేరళ నర్సుకు ఉరిశిక్ష! కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు!

  Wed Jan 01, 2025 17:15        India

నా బిడ్డ తల్లిని మిస్సవుతోంది.. ఉరిశిక్ష పడిన నర్సు భర్త ఆవేదన

యెమెన్‌ లో హత్య కేసులో దోషిగా తేలి, ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియ ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. హతుడి కుటుంబాన్ని ఒప్పించి నిమిషాను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో తన భార్య క్షేమంగా స్వదేశానికి తిరిగొస్తుందని నిమిషా భర్త టామీ థామస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

హతుడు తలాల్‌ అబ్దో మహదీ కుటుంబాన్ని తాము పరిహారానికి ఒప్పించగలమని తాను, తన కూతురు ఆశతో ఉన్నామని థామస్‌ చెప్పారు. తన కూతురు గతంలో తల్లితో గడిపిన రోజులను గుర్తుచేసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నదని తెలిపారు. ఆమె తల్లి లాలనను, ప్రేమను మిస్సవుతున్నదని అన్నారు. నర్సు నిమిషా ప్రియ.. 2008లో కూలీలుగా జీవనం గడుపుతున్న తన తల్లిదండ్రులను ఉన్నత స్థితిలో చూడాలనే కోరికతో యెమెన్‌కు వెళ్లింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అక్కడ పలు ఆస్పత్రుల్లో పనిచేసింది. ఆ తర్వాత యెమెన్‌కు చెందిన తలాల్‌ అబ్దో మహదీతో కలిసి సొంతంగా క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత అబ్దోతో గొడవలు జరగడంతో స్వదేశానికి తిరిగిరావాలని భావించింది. కానీ నిమిషా ప్రియ పాస్‌పోర్టును తిరిగిచ్చేందుకు అబ్దో నిరాకరించాడు. దాంతో అతడికి మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్టు తిరిగి తీసుకోవాలని భావించింది. అనుకున్నట్టే ప్లాన్ అమలుచేసింది. అయితే దురదృష్టవశాత్తు మత్తు డోస్‌ ఎక్కువై అబ్దో మరణించాడు.

 

దాంతో ఆమెపై హత్య కేసు నమోదైంది. ట్రయల్‌ కోర్టు ఆమె హత్య చేసినట్లు నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. చివరికి యెమెన్‌ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరగా.. అతడు కూడా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాడు. దాంతో నిమిషా ప్రియకు ఉరి ఖరారైంది. ఇక హతుడు అబ్దో కుటుంబం పరిహారానికి అంగీకరించి క్షమిస్తే తప్ప ఆమెకు ఉరి తప్పేలా లేదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Yemen #Murder #Death