లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

Header Banner

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

  Sat Jan 04, 2025 17:14        Politics

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ప్రారంభించిన ఆయన, కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను తీసుకున్న తొలి నిర్ణయం... 'విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఉండకూడదు' అని వెల్లడించారు. విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ తమ ఫొటోలు ఉండవని, తమ పార్టీ రంగులు ఉండవని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చే మెటీరియల్ లోనూ తమ పేర్లు ఉండవని తెలిపారు.

 

ఇంకా చదవండి: ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

 

సమాజం కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మనం మంచి పనులు చేయాలనుకుంటామో, వారి పేర్లు పెట్టామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. "డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లు అందజేశాం. ఇవాళ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం తీసుకువచ్చాం. గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే, ముందుగా పట్టుకెళ్లేది విద్యార్థులనే. ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగితే పిల్లలు వెళ్లాలి, మంత్రి ప్రోగ్రామ్ జరిగితే పిల్లలు వెళ్లాలి... కానీ నేను విద్యాశాఖ మంత్రిగా రాగానే... మన పిల్లలు ఎక్కడికీ వెళ్లరు, కేవలం చదువుకుంటారు అని ఆదేశాలు జారీ చేశాను. అంతేకాదు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కేవలం జాబ్ మేళాలు మినహా మరే ఇతర కార్యక్రమాలు జరిపేందుకు వీల్లేదని చెప్పాను. ఇక, ఉపాధ్యాయులు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిపై యాప్ ల భారం విపరీతంగా ఉంది. ఆ యాప్ ల భారం తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది" అని మంత్రి నారా లోకేశ్ వివరించారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting