ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ - ఆస్ట్రేలియా సభ్యుడి ఆర్ధిక సహాయం! కుడి చేయి కోల్పోయినా లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు! ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి కొండపల్లి చేతులమీదుగా!

Header Banner

ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ - ఆస్ట్రేలియా సభ్యుడి ఆర్ధిక సహాయం! కుడి చేయి కోల్పోయినా లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు! ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి కొండపల్లి చేతులమీదుగా!

  Mon Jan 06, 2025 21:31        Australia, Helping Hand

- క్రీడారంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన శాప్, టిడిపి NRI సెల్.
- ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రీడాకారులకు ఎన్ఆర్ఐల ప్రోత్సాహం అవసరం -శాప్ ఛైర్మన్ రవి నాయుడు
- నెల్లూరుకు చెందిన ఇంటర్నేషనల్ పారా అథ్లెట్ భవానీకి ఆర్ధికప్రోత్సాహం అందించాలని ఎన్ఆర్ఐ సెల్ ను కోరిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
- పారా అథ్లెట్ భవానీకి రూ.లక్ష ఆర్ధికప్రోత్సాహం అందించిన ఎన్ఆర్ఐ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్, దాత లగడపాటి సుబ్బారావు
- ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్ గారికి, మరియు ఆర్థిక సహాయం చేసిన ఆస్ట్రేలియా ఎన్నారై సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలిపిన పారా అథ్లెట్ భవానీ

 

విధి వంచించి కుడిచెయ్యిని భుజం వరకు కోల్పోయినా, తనను ప్రోత్సహించిన తండ్రిని భగవంతుడు దూరం చేసినా, తానెంతో ఇష్టపడే అమ్మ అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా, అనుకున్న లక్ష్యాన్ని చేదించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మట్టిలో మాణిక్యం పారాఅద్లెటిక్ క్రీడాకారిణి భవానీని ప్రోత్సహించేందుకు ప్రవాసాంధ్ర దాత ముందుకు వచ్చారు. దాత లగడపాటి సుబ్బారావు లక్ష రూపాయల విరాళాన్ని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా పారాఅద్లెటిక్ క్రీడాకారిణి భవానీకి అందజేశారు.

 

నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన చంద్రయ్య బుజ్జమ్మ దంపతులకు కుమార్తె భవానీకి క్రీడలు అంటే ఎంతో ఇష్టం. చిన్నతనంలో నాన్న చంద్రయ్య భవానీని క్రీడల్లో ప్రోత్సహించారు. తన చిన్నతనంలో ఐదో తరగతి చదువుతున్న సమయంలో జిల్లా స్థాయిలో పథకం సాధించడంతో నాన్న భవానిని తన మెడల మీద ఎక్కించుకుని ఊరంతా ఊరేగించారు. తన కుమార్తె భవాని ఏ రోజైనా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అందరికీ గొప్పగా చెప్పాడు. అలా సాఫీగా సాగుతున్న కుటుంబంలో అనుకోని సంఘటన ఎదురయ్యింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆడుకుంటున్న భవానీపై విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ ఘాతానికి గురవటం, అదే సమయంలో ఆమెను రక్షించబోయిన తండ్రి చంద్రయ్య ప్రాణాలు కోల్పోవటం, ఈ ప్రమాదంలో భవానీ తన చేయిని కోల్పోవడం, అమ్మకు అనారోగ్య సమస్యలు వెంటాడడం ఏకకాలంలో జరిగాయి. అనుకోని సంఘటనలతో హతాశురాలైన భవానీ మంచానికి పరిమితమైంది. ఓవైపు కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న బుజ్జమ్మ తన కూతురును ధైర్యవచనాలతో పట్టుదలను నింపింది. తాను కూలి పనులు చేస్తూ తన భర్త చంద్రయ్య ఆశయాన్ని సాదించేవిధంగా బిడ్డను చదువులోనూ క్రీడల్లోనూ ప్రోత్సహించింది. ఫలితంగా భవాని డిగ్రీ చదువుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో పారాఅద్లెటిక్ పోటీలలో పథకాలు సాధించింది. ఓవైపు కూలికి పోకపోతే పూటగడవని జీవితం, మరోవైపు క్రీడల్లో రాణించాలంటే వ్యయ ప్రయాసులకు ఓర్చి ముందుకు సాగాల్సి రావడం, ఈ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది. అయినా పట్టు వదలకుండా తల్లి కూలిపనులు చేస్తూ బిడ్డను ప్రోత్సహించింది. 

 

గత వైకాపా ప్రభుత్వ హయాంలో పథకాలు సాధించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి స్పందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు వారిని చేరదీసి, దాతల సాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్ తో కలిసి రవినాయుడు పలువురి దృష్టికి తీసుకెళ్ళారు. ఫలితంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో నివసిస్తున్న లగడపాటి సుబ్బారావుతో చర్చించి క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహంగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చే విధంగా ఒప్పించారు.

 

ఇందుకోసం శాప్ చైర్మన్ రవి నాయుడు, రాజశేఖర్ పలుమార్లు సంప్రదించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చి ప్రవాసాంధ్రుడు లగడపాటి సుబ్బారావు ఇచ్చిన లక్ష రూపాయల విరాళాన్ని మంత్రి చేతుల మీదుగా పారాఅద్లెటిక్ క్రీడాకారిణి భవానీకి ఆమె తల్లి బుజ్జమ్మ సమక్షంలో సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మట్టిలో మాణిక్యాలకు కొదవలేదని క్రీడల్లో సత్తా చాటే క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారిని గుర్తించి ప్రోత్సహిస్తే తాము దాతల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించక మరుగున పడిపోతున్నారని, వారందరినీ గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సిద్ధంగా ఉందని చైర్మన్ రవినాయుడు తెలియజేశారు. భవానీ మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని వారు ఆకాంక్షించారు.

Financial Help For Athlete.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TDP #NRITDP #Australia #KondapalliSrinivas #Melbourne