ప్రధానమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు! సురక్షితంగా వారి గ్రామంలో దించే విధంగా..

Header Banner

ప్రధానమంత్రి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు! సురక్షితంగా వారి గ్రామంలో దించే విధంగా..

  Mon Jan 06, 2025 20:46        Politics

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తుండడం తెలిసిందే. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. బహిరంగ సభకు తీసుకువెళుతున్న ప్రతి ఒక్కరిని మరల సురక్షితంగా వారి గ్రామంలో దించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

ఇంకా చదవండి: వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

 

ఆర్టీసీ బస్సులు పర్యవేక్షణకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగులో ఇబ్బందులు రాకుండా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరి సహకారంతో మోదీ పర్యటన విజయవంతం చేద్దామన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మండలాల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ నియంత్రణపై ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని, రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

నేడు (6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

AP: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli