ఇచ్చిన హామీలే కాకుండా, హామీ ఇవ్వనివి కూడా అమలు! జగన్ గాలిలో కాకుండా రోడ్లపైకి..
Sat Jan 04, 2025 19:35 Politicsవిజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో ఇవాళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను పద్ధతి ప్రకారం నెరవేరస్తున్నామని స్పష్టం చేశారు. హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి తాము చేస్తున్న మంచి పనులను చూడవచ్చని లోకేశ్ పేర్కొన్నారు. "జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు రోడ్లు కూడా మంచివి వేశాం, ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చు.
ఇంకా చదవండి: హాట్ టాపిక్ గా మారిన న్యూస్.. ఆ హీరోతో ప్రేమలో పడ్డ శ్రీలీల! గుట్టు విప్పిన బాయ్‌ఫ్రెండ్?
ఇంకా మేం చేయాల్సి చాలా ఉంది, అన్నీ చేస్తాం. జగన్ వచ్చి మేం అమలుచేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నాం. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి మాది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాదు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజాదర్బార్ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నాం. గత ప్రభుత్వ తప్పుల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. రూ.4 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నాం. గత ప్రభుత్వం మూసివేసిన అన్నక్యాంటీన్లు తెరిచాం. ఉచిత గ్యాస్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాం" అని వివరించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!
రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.