చైనా వైరస్‌లపై ఆందోళన వద్దు! ప్రజలకు కేంద్రం భరోసా!

Header Banner

చైనా వైరస్‌లపై ఆందోళన వద్దు! ప్రజలకు కేంద్రం భరోసా!

  Sun Jan 05, 2025 10:19        Others

హ్యూమన్‌ మెటాన్యుమోనియా(హెచ్‌ఎంపీవీ)తో సహా చైనాలో ఇటీవల పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం దేశ ప్రజలకు భరోసా ఇచ్చింది. చైనాలో పరిస్థితి అసాధారణమేమీ కాదని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసేందుకు సంయుక్త పర్యవేక్షణ గ్రూపుతో శనివారం సమావేశం నిర్వహించింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అనంతరం ఓ ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. హెచ్‌ఎంపీవీ వంటి వైరస్‌లు భారత్‌లో ఇది వరకు నుంచే వ్యాప్తిలో ఉన్నాయని, అటువంటి కేసులను సమర్థంగా ఎదుర్కోగల యంత్రాంగం తమకు ఉందని ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది. మరోవైపు చైనాలో పిల్లులు ఫీలైన్‌ ఇన్ఫెక్షియస్‌ పెర్టోనిటిస్‌ అనే ప్రాణాంతక వైరస్‌ బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పెంచుకుంటున్న కొందరు కొవిడ్‌కు వాడిన మందులను తమ పిల్లులకు వేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #China #Virus #Covid #Influenza