ఆదివారంరోజే చికెన్, మటన్ ఎందుకు తింటారో తెలుసా? దీని వెనుక అసలు కారణం ఇదే!

Header Banner

ఆదివారంరోజే చికెన్, మటన్ ఎందుకు తింటారో తెలుసా? దీని వెనుక అసలు కారణం ఇదే!

  Sun Jan 05, 2025 18:48        Life Style

ఆదివారం వచ్చిందంటే చాలు.. జనాలంతా చికెన్ షాపుల ముందు, మటన్ షాపుల ముదు బారులు తీరతారు. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వారికి సరిపడా మాంసాహారాన్ని కొనుగోలు చేసి తీసుకువెళతారు. అందుకే ప్రత్యేకంగా ఆదివారం మాత్రమే తెరిచే దుకాణాలు కూడా ఉంటాయి. అసలు ఆదివారం రోజే మాంసాహారం ఎందుకు తింటారనే విషయాన్ని తెలుసుకుందాం.

 

ఈ రకమైన ఆహారాన్ని తీసుకుంటారు
సాంప్రదాయం, సంస్కృతిగా మారింది. అనేక కుటుంబాలు ఆదివారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావించి ఆ రోజు మాంసాహారం తినడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసే రోజు. మాంసాహారం తినడం ఈ సమావేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. చికెన్, మటన్ వంటి మాంసాహారం చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఆదివారం రోజు ఒక విందుగా భావించి ఈ రకమైన ఆహారాన్ని తీసుకుంటారు. వారం రోజులు పనిచేసిన తర్వాత ఆదివారం విశ్రాంతి తీసుకునే రోజు. మాంసాహారం తినడం ఒక విధమైన విశ్రాంతిగా భావిస్తారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇటువంటి పద్ధతులు ఎంచుకోవాలి
ఆదివారం మాత్రమే కాకుండా, వారం పొడవునా మాంసాహారాన్ని ఆరోగ్యకరమైన మోతాదులో తీసుకోవచ్చు. అధికంగా మాంసాహారం తీసుకోవడం కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మాంసం ప్రొటీన్ కు మంచి మూలం. ప్రొటీన్ శరీర కణాల నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మాంసం విటమిన్ B12, జింక్, ఇనుము వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.

 

ఎర్ర మాంసంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.మాంసంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా తీసుకోవడం బరువు పెరుగుతారు. మాంసాహారంతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు వంటి ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. ఎర్ర మాంసానికి బదులుగా కోడి మాంసం, చేపలు వంటి తక్కువ కొవ్వు ఉన్న మాంసాన్ని ఎంచుకోవాలి. మాంసాన్ని వేయించడం, వడకడం వంటి పద్ధతులకు బదులుగా ఉడకబెట్టడం, ఆవిరి పట్టడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #Foods #Meat #NonVeg #Chicken #Mutton #Fish #Prawns