ట్రూడో తర్వాత కెనడా ప్రధాని ఎవరు? రేసులో ఆమె పేరు!

Header Banner

ట్రూడో తర్వాత కెనడా ప్రధాని ఎవరు? రేసులో ఆమె పేరు!

  Tue Jan 07, 2025 10:43        Others

కెనడా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన్ను ఎన్నికలకు ముందే తప్పుకోవాలన్న ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ట్రూడో నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ సిద్దమవుతోంది. ఈ రేసులో భారతీయ మూలాలున్న లాయర్, ప్రస్తుత కేబినెట్ మంత్రి అనితా ఆనంద్ ముందున్నారు.

 

తొమ్మిదేళ్ల పదవీకాలం తర్వాత రాజీనామాకు సిద్దమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో .. తాను పదవీవిరమణ చేస్తానని, అయితే లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని తాజాగా ప్రకటించారు. దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రి, పార్టీ నాయకుడిగా కొనసాగుతారు. ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కెనడాలో తక్షణ ఎన్నికలు జరగట్లేదు.

 

మార్చి 24 వరకు సస్పెండ్ చేసిన పార్లమెంట్ ఏదైనా విశ్వాస ఓట్లు లేదా ఎన్నికల పిలుపులు జరగడానికి ముందు తప్పనిసరిగా పునఃప్రారంభించాల్సి ఉంది. అలాగే తదుపరి ఎన్నికలు మే కంటే ముందుగా జరగవు. అక్టోబర్‌లో షెడ్యూల్ తేదీగా ఉంటుంది.దీంతో ట్రూడో నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి నాయకత్వ పోటీని వేగవంతం చేయడం లిబరల్ పార్టీ నేతల లక్ష్యంగా ఉంది. అలాగే ప్రధానిగా భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ తో పాటు మెలానీ జోలీ, మార్క్ కార్నీ పోటీ పడుతున్నారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వాస్తవానికి కెనడాలో ప్రస్తుతం ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశాలూ లేకపోలేదు. ఈ క్రమంలో గవర్నర్ జనరల్ పాత్ర కీలకం కానుంది. ట్రూడో పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోతే తప్ప బలవంతంగా తప్పించే అవకాశాలు ఉండవు. గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కూడా ఇందులో జోక్యం చేసుకోరు.అయినా నాయకత్వ మార్పులతో సంబంధం లేకుండా లిబరల్ పార్టీ నేతలకు వచ్చే ఎన్నికలు కఠినంగా మారబోతున్నాయి.

 

ఈ క్రమంలో భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ పేరు తెరపైకి వస్తోంది. ఓక్‌విల్లే పార్లమెంటు సభ్యురాలు అయిన అనితా ఆనంద్ లిబరల్ పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఆమె రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. అక్కడ ఆమె లైంగిక దుష్ప్రవర్తనను ఎదుర్కోవడానికి, కెనడియన్ సాయుధ దళాలలో సాంస్కృతిక సంస్కరణలను ప్రోత్సహించడానికి జరిగిన ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. గతేడాది ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలిగా పనిచేస్తూనే రవాణా మంత్రిగా నియమితులయ్యారు.ఆమె తల్లితండ్రులు ఇద్దరూ భారతీయులే. 

 

గ్రామీణ నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన ఆనంద్ కెనడియన్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు మరియు ట్రూడో తర్వాత లిబరల్ పార్టీ నాయకుడిగా ఎంపికయ్యే ప్రముఖ పోటీదారుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Canada #Primeminister #Trudo #Resignation