హార్ట్ ఎటాక్ వ‌చ్చే 30 రోజుల ముందు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి! జాగ్ర‌త్త ప‌డండి!

Header Banner

హార్ట్ ఎటాక్ వ‌చ్చే 30 రోజుల ముందు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి! జాగ్ర‌త్త ప‌డండి!

  Sun Jan 05, 2025 19:27        Health

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె పోటుతో మ‌ర‌ణిస్తున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు పైబ‌డిన వారు మాత్ర‌మే గుండె పోటు బారిన ప‌డేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్‌, కార్డియాక్ అరెస్ట్‌, హార్ట్ ఫెయిల్యూర్‌తో ఉన్న‌ట్లుండి కుప్ప‌కూలి చ‌నిపోతున్నారు. ఇవి జ‌ర‌గ‌డానికి ముందే వ‌చ్చే సంకేతాల‌ను చాలా మంది గ‌మ‌నించ‌డం లేదు. దీంతో అనర్థం జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య కాలంలో యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు ఇలా చ‌నిపోవ‌డం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అయితే హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌, హార్ట్ ఫెయిల్యూర్ అవ‌డానికి ముందే మ‌న శ‌రీరం మ‌న‌కు కొన్ని సూచ‌న‌ల‌ను, సంకేతాల‌ను ఇస్తుంది. వాటిని గుర్తించ‌డం ద్వారా ఎలాంటి అన‌ర్థం జ‌ర‌గ‌కుండా మ‌నం ముందుగానే ప‌సిగ‌ట్టి చికిత్స తీసుకోవ‌చ్చు. దీంతో ప్రాణాల‌ను నిలుపుకోవ‌చ్చు.

 

క‌ళ్ల కింద వాపులు..
హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొంద‌రిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ముఖ్యంగా నిద్ర‌లేమి స‌మ‌స్య ఉంటుంది. అస‌లు ఏమాత్రం నిద్ర ప‌ట్ట‌దు. దీంతో క‌ళ్లు వాపుల‌కు గుర‌వుతాయి. గుండె నుంచి ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే ఇలా జ‌రుగుతుంది. అయితే కేవ‌లం నిద్ర‌లేమి స‌మ‌స్య‌నే అయితే స‌రిగ్గా నిద్ర‌పోతే ఈ ల‌క్ష‌ణం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలా చేసినా కూడా ఈ ల‌క్ష‌ణం మాత్రం అలాగే ఉంటే అప్పుడు దాన్ని గుండె జ‌బ్బుగా అనుమానించాలి. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్టర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలాగే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌ళ్ల కింద బిళ్ల‌లాగా వ‌స్తాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అలా బిళ్ల‌ల మాదిరిగా క‌నిపిస్తాయి. ఇలా ఉంటే చాలా డేంజ‌ర్‌. వీరికి అతి త్వ‌ర‌లోనే హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని గుర్తించాలి. వెంట‌నే చికిత్స తీసుకోవాలి. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఛాతిపై బ‌రువు పెట్టిన‌ట్లు..
ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల క‌ళ్లు వాపుల‌కు గురై నొప్పులుగా ఉంటాయి. అస‌లు ఏం చేసినా ఈ నొప్పి త‌గ్గ‌దు. ఈ నొప్పి అంత‌కంత‌కూ పెరిగిపోతుంటే వెంట‌నే హాస్పిట‌ల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది. అదేవిధంగా కొంద‌రికి కంటి చూపు కూడా పోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇలా గ‌న‌క జ‌రిగితే దాన్ని క‌చ్చితంగా గుండె స‌మ‌స్య‌గా అనుమానించాలి. ఇక హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఛాతిలో బ‌రువుగా ఉంటుంది. ఛాతిపై పెద్ద బ‌రువు పెట్టిన‌ట్లు అనిపిస్తుంది. శ్వాస తీసుకోవ‌డం కూడా క‌ష్టంగా ఉంటుంది. అలాగే అడుగు తీసి అడుగు వేయ‌డం క‌ష్టంగా మారుతుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కేట‌ప్పుడు లేదా దిగేట‌ప్పుడు ఈ విధంగా అనిపిస్తుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌చ్చితంగా హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన‌వే. క‌నుక ఇవి క‌నిపిస్తే నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. 

 

ఎడ‌మ వైపు నొప్పి ఉంటే..
చాలా మందికి గ్యాస్ నొప్పికి, ఛాతిలో వ‌చ్చే గుండె నొప్పికి తేడా తెలియ‌దు. గ్యాస్ నొప్పి వ‌చ్చి పోతూ ఉంటుంది. కానీ గుండె నొప్పి వ‌స్తే అస‌లు త‌ట్టుకోలేరు. సూదుల‌తో పొడిచిన‌ట్లు వ‌స్తుంది. అలాగే ఆ నొప్పి ఎడ‌మ ద‌వ‌డ నుంచి ఎడ‌మ భుజం మీదుగా ఎడ‌మ చేయి కింద‌కు వ్యాప్తి చెందుతుంది. ఇలా గ‌న‌క జ‌రిగితే క‌చ్చితంగా దాన్ని గుండె పోటుగా భావించాలి. లేదంటే గుండె పోటు రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఇలా కొన్ని ర‌కాల సూచ‌న‌లు హార్ట్ ఎటాక్ కు ముందు లేదా హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు కొన్ని రోజుల ముందుగానే క‌నిపిస్తాయి. వీటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ప్రాణాంత‌కం కాకుండా అడ్డుకోవ‌చ్చు. దీంతో ప్రాణాల‌ను నిలుపుకోవ‌చ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా.. 

 

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి! 

 

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల! 

 

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే! 

 

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Heart #Cholesterol #HeartProblems