ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

Header Banner

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

  Sun Jan 05, 2025 20:44        India

ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఎంపీవీ కేసులు ఏం లేవు అని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. ఇప్పటి వరకూ మన భారత దేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవు అని చెప్పారు. ఈ వైరస్ కారణంగా ప్రజలు ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే, తాకిన తర్వాత అదే చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకటం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుందని అన్నారు.

 

వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా బయటపడనున్నాయని అన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కన్పిస్తాయని తెలిపారు. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారి తీస్తుందని అన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినపుడు, తుమ్మినపుడు, నోటిని, ముక్కును చేతిరుమాలు అడ్డు పెట్టుకోవాలని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండటం వంటి చర్యలతో పాటు తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలి, తగినంత నిద్ర పోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు. వైరస్ లక్షణాలు కన్పించిన వారు క్వారంటైన్‌లో ఉండటం మంచిదని అన్నారు.

 

ఇంకా చదవండి: అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్! ఈ విషయంలో ఒక తల్లిగా..

 

వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదని, ఉపయోగించిన టవల్స్, రుమాళ్ల వంటి వాటిని మళ్లీ వాడరాదని, చేతులతో తరచూ కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని సూచించారు. అదే విధంగా వైరస్ లక్షణాలున్న వ్యక్తులకు సమీపంగా ఇతరులు ఉండకూడదని అన్నారు. వైరస్ సోకినట్లు అనుమానం ఉన్న వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు. ఇప్పటి వరకూ హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స అనేది లేదని తేల్చిచెప్పారు. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ తెరపీ వంటివి ఇవ్వటం జరుగుతుందని స్పష్టం చేశారు. వైరస్ తీవ్రతకు ఎక్కువగా గురయ్యే చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన చికిత్స అందిస్తారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #HMPVVirus #AndhraPradesh #APGovernment #APPeoples #HealthCare