కొత్త మద్యం షాపులకు మరో నోటిఫికేషన్! ఫీజులపై తాజా నిర్ణయం!

Header Banner

కొత్త మద్యం షాపులకు మరో నోటిఫికేషన్! ఫీజులపై తాజా నిర్ణయం!

  Wed Jan 08, 2025 12:01        Politics

ఏపీలో మరిన్ని మద్యం షాపులు రానున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాత మద్యం బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకొస్తూ మద్యం దుకాణాలు కొనసాగుతు న్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో పది శాతం దుకాణాలు కల్లు గీత వర్గాలకు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు 340 మద్యం దుకాణాలను కల్లు గీత వర్గాలకు దక్కేలా ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దం చేసింది.

 

ఏపీలో కొత్తగా మరో 340 మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 10 శాతం దుకాణాలు కల్లు గీత వర్గాలకు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా శెట్టిబలిజ, ఈడిగ, గౌడ, యాత, గౌడ్, శ్రీశయన, శెగిడి, గౌండ్ల, గామల్ల కులాలకు మొత్తం 340 మద్యం దుకాణాలను రిజర్వు చేశారు. అదేవిధంగా ఏ జిల్లాలో ఏ ఉప కులానికి ఎన్ని షాపులు కేటాయించాలో కూడా ఇప్పటికే నిర్ణయించారు. వీటికి సంబంధించి ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసి ప్రభుత్వం కోసం నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండే సొండి కులస్థులకు 4 దుకాణాలను కేటాయించాలని నిర్ణయించారు. అదే విధంగా సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటనలో భాగంగా ఓ కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు వారికి ఒక దుకాణాన్ని రిజర్వు చేయనున్నారు. గీత కార్మిక కులాల కోసం కేటాయిం చిన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, లైసెన్సుల కేటాయింపు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా అవి ప్రారంభం అయ్యేలా అధికారులు కార్యాచరణ ఖరారు చేసారు. వీరికి కేటాయించే దుకాణాల ఫీజు అన్‌ రిజర్వుడు దుకాణాల లైసెన్సు ఫీజులో సగం మాత్రమే ఉంటుంది.

 

అన్‌ రిజర్వుడు కేటగిరీలో ఉన్న దుకాణాలకు ఆయా ప్రాంతాల జనాభాను బట్టి రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకూ లైసెన్సు రుసుము వసూలు చేస్తున్నారు. కానీ గీత కార్మికుల కోసం కేటాయించిన దుకాణాలకు మాత్రం అందులో సగం రూ.25 లక్షల నుంచి రూ.42.50 లక్షలు మాత్రమే ఉండనుంది. ఈ గీత కార్మిక కులాలకు కేటాయించిన దుకాణాలకు 2026 సెప్టెంబరు 30వ తేదీ వరకూ లైసెన్సులు జారీ చేయనున్నారు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. దీనికి తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే! 

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు! 

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు.. 

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP