మీ లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే లక్షణాలివే! కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Header Banner

మీ లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే లక్షణాలివే! కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

  Wed Jan 08, 2025 13:02        Health

ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. అయితే, మన కాలేయం దెబ్బ తిన్నా, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 

 

కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. లివర్ ఎన్నో విధుల్ని నిర్వహిస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు.

 

ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. అయితే, మన కాలేయం దెబ్బ తిన్నా, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పదే పదే కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు కనిపించే లక్షణాలేంటి..? లివర్‌ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

 

కళ్లు, చర్మం పచ్చ రంగులో మారడం పచ్చ కామెర్లు లక్షణాలు. ఈ సంకేతాలు పదే పదే మీకు కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడిందని అర్థం చేసుకోండి. పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యల్ని సూచిస్తుంది. పచ్చ కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాసం ఉంది. 

 

​కాలేయ పనితీరు మెరుగ్గా లేనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. దీంతో.. చాలా అవయవాల్లో నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో.. శరీరంలోని కొన్ని భాగాలు వాపులకు లోనవుతుంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. చేతి వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. లివర్ డ్యామేజ్‌ని సూచించే సంకేతం ఇది. అందుకే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

​మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.

 

మీకు ఏది తినాలనిపించడం లేదా.. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందా అయితే ఇవి మంచి లక్షణాలు కావు. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే సంకేతం. లివర్ సమస్యతో బాధపడుతున్నట్టుయితే ఆకలి మందగిస్తుంది. చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు. అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి. తరుచుగా వాంతులు అవుతుంటాయి. భోజనం చేసిన వెంటనే వికారం, వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం బెస్ట్.

 

చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మ‌చ్చ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. లేదా గోళ్లు ప‌సుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి. 

 

కాలేయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- రోజూ వ్యాయామాన్ని భాగం చేసుకోండి. ​వైద్యుల ప్రకారం బ్రిస్క్ వాకింగ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
- ప్రతి రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి కి.మీకి నడకలో వేగం పెంచితే ఫలితం అద్భుతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- సైక్లింగ్, స్విమ్మింగ్, హైకింగ్ వంటి వ్యాయామాల్ని చేస్తే లివర్ సేఫ్‌గా ఉంటుంది.
- ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
- తినే ఆహారంపై దృష్టి పెట్టండి. చక్కెర, సోడియం అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే! 

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు! 

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు.. 

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Health #Foods #Alcohol #Liver #Damage