ఛాంపియన్స్‌ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా దూరం? ఆట మధ్యలోనే మైదానాన్ని వీడి.. కారణం ఇదే!

Header Banner

ఛాంపియన్స్‌ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా దూరం? ఆట మధ్యలోనే మైదానాన్ని వీడి.. కారణం ఇదే!

  Wed Jan 08, 2025 15:00        Sports

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన సిడ్నీ టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో, ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అతడు పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించినట్టుగా అది వెన్నునొప్పి అయితే పర్వాలేదు. బుమ్రా కచ్చితంగా అందుబాటులోకి వస్తాడు. ఒకవేళ అది కాస్త గ్రేడ్-1 తీవ్రత కలిగిన ఫ్రాక్చర్ అయితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండబోడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఇదే విషయమై సెలక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపింది. వెన్నునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కొంతకాలం జట్టుకి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. మెడికల్ పరీక్షలో వచ్చే ఫలితం ఆధారంగా సెలక్టర్ల నిర్ణయం ఉండనుంది. బుమ్రా ఇంతకుముందు ఒకసారి వెన్నునొప్పి ఫ్రాక్చర్‌తో బాధపడడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమవుతోంది.

 

ఇంకా చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

అందుకే, వెన్నునొప్పిని గుర్తించిన తొలి దశలోనే ఆటకు విరామం ఇవ్వాలని, లేదంటే తీవ్రత ఇంకా ఎక్కువవుతుందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఒకరు చెప్పినట్టుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కాగా, జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి మెడికల్ రిపోర్ట్ సర్జన్‌ పరిశీలన కోసం పంపించారు. అతి త్వరలో అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. సమస్య తీవ్రత పెద్దగా లేదని గుర్తిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే ఆటగాళ్ల మొదటి ప్రాబబుల్స్ జాబితాలోనే అతడి పేరు ఉంటుంది. మరోవైపు, బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా వ్యక్తిగత ప్రదర్శన చేయడంతో పాటు రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించి రాణించడంతో బుమ్రాను ఎంపిక చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సెలక్టర్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #JaspritBumra #ChampionsTrophy2025 #Cricket #SportsNews #BCCI