దోమను దోమతోనే చంపాలి! ఆడ దోమల అంతమే లక్ష్యం! సైంటిస్ట్‌ల కొత్త ప్రయోగం!

Header Banner

దోమను దోమతోనే చంపాలి! ఆడ దోమల అంతమే లక్ష్యం! సైంటిస్ట్‌ల కొత్త ప్రయోగం!

  Thu Jan 09, 2025 11:06        Technology

ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత ఉంటుంది. అయితే అచ్చంగా ఇప్పుడు అలాగే దోమను దోమతోనే చంపేందుకు సైంటిస్ట్‌లు కొత్త ప్రయోగం చేస్తున్నారు. మగ దోమల వీర్యాన్ని విషంగా మార్చేలా సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. దీని వల్ల ఆడదోమల వ్యాప్తిని తగ్గించవచ్చని ఆలోచన చేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ప్రయోగమే ఈగల్లో జరపగా.. అవి మంచి ఫలితాలను ఇచ్చినట్లు తెలిపారు. దోమలతో వచ్చే వ్యాధులను అరికట్టడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. 

 

దోమలతో ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ సహా అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి దోమలే కారణం అవుతాయి. అందుకే ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుద్ధ్యం లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. ఇక వర్షాకాలంలో అయితే దోమల బెడద ఎక్కువగా ఉండి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అసలు దోమలను కట్టడి చేయడం వల్ల ఈ వ్యాధులను అరికట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప్రయోగానికి సైంటిస్ట్‌లు చర్యలు చేపట్టారు.

 

కొన్నిసార్లు దోమలు కుట్టడం వల్ల వ్యాధులు సోకి.. అవి తీవ్రంగా మారి ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఆడ దోమలే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఆడ దోమలకు చెక్‌ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. దోమలు కుట్టడం వల్ల విజృంభిస్తోన్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగాన్ని చేశారు. మనుషులను కుట్టి వివిధ వ్యాధులకు కారణం అయ్యే ఆడ దోమల సంఖ్యను తగ్గించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇందులో భాగంగా ఆడ దోమతో శృంగారం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మగ దోమలతో శృంగారం జరిపిన ఆడ దోమలు చనిపోవడం వల్ల వాటి సంఖ్యను తగ్గించవచ్చని తెలిపారు. ఇక మగ దోమల వీర్యం విషపూరితం కావడం వల్ల పురుగు మందుల లాగా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను నివారించవచ్చని సైంటిస్ట్‌లు వెల్లడించారు. 

 

ఇక ఇలాంటి ప్రయోగాలే ఈగల్లో సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. ఈగల వీర్యం విషపూరితం చేయగా.. వాటితో సంభోగం జరిపిన ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అయితే ఈ ప్రయోగం వల్ల మనుషులు, ఇతర జీవులకు ఎలాంటి హానిలేదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే.. ఈ ప్రయోగాన్ని మరింత పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామని మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Technology #Mosquitoes #FemaleMosquitoes #Scientists