రెడ్, బ్లూ కలర్ ట్రైన్స్ మధ్య తేడా తెలుసా? 90 శాతం మందికి తెలియదు!

Header Banner

రెడ్, బ్లూ కలర్ ట్రైన్స్ మధ్య తేడా తెలుసా? 90 శాతం మందికి తెలియదు!

  Wed Jan 08, 2025 14:29        Gadgets

మీరు ఎప్పుడైనా రైళ్ల రంగులను గమనించారా? మనకు ప్రధానంగా బ్లూ, రెడ్ కలర్స్‌లో రైళ్ల బోగీలు కనిపిస్తుంటాయి. వీటి నిర్మాణం, భద్రత, సౌకర్యాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. వీటి మధ్య తేడాలతో పాటు ఏది సురక్షితమైనదో తెలుసుకుందాం.

 

ఇండియన్ రైల్వేస్ రోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. మన దేశంలో అనేక రకాల రైళ్లు నడుస్తున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా రైళ్ల రంగులను గమనించారా? మనకు ప్రధానంగా బ్లూ, రెడ్ కలర్స్‌లో రైళ్ల బోగీలు కనిపిస్తుంటాయి. వీటి నిర్మాణం, భద్రత, సౌకర్యాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. వీటి మధ్య తేడాలతో పాటు ఏది సురక్షితమైనదో తెలుసుకుందాం.

 

బ్లూ కలర్ ట్రైన్ కోచ్‌లను ICF కోచ్‌లు (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) అంటారు. వీటిని చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారు చేసేవారు. చాలాకాలంగా మన ప్రయాణాల్లో భాగమైన ఈ బోగీల ప్రొడక్షన్‌ను కొన్నేళ్ల క్రితమే నిలిపేశారు. చివరి ICF కోచ్‌ 2018లో తయారైంది.

 

రెడ్ కలర్ LHB కోచ్‌లు.. ఎరుపు రంగులో ఉండే వాటిని LHB కోచ్‌లు (లింకే హాఫ్‌మన్ బుష్) అంటారు. ఈ బోగీలు టెక్నాలజీలో ఒక అడుగు ముందున్నాయి. వీటిని జర్మన్ టెక్నాలజీతో రూపొందించారు. ప్రస్తుతం వీటిని కపుర్తలాలో తయారు చేస్తున్నారు.

 

సేఫ్టీ విషయానికి వస్తే.. LHB కోచ్‌లు, ICF కోచ్‌ల కంటే ఎన్నో రెట్లు బెటర్. వీటికి ఒక స్పెషల్ యాంటీ-క్లైంబింగ్ ఫీచర్ ఉంటుంది. ఇది ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కకుండా అడ్డుకుంటుంది. తద్వారా భారీ నష్టం, ప్రాణనష్టం, గాయాల తీవ్రతను తగ్గిస్తుంది. అయితే ICF కోచ్‌లలో ఈ ఫీచర్ ఉండదు. దీని కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు అవి ఒకదానిపై ఒకటి ఎక్కే అవకాశం ఉంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

LHB కోచ్‌లను హై-స్పీడ్ ట్రైన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి హై-స్పీడ్‌తో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. LHB కోచ్‌లు ఉండే రైళ్లు గంటకు 200 కి.మీ వరకు వేగంతో ప్రయాణించగలవు, అయితే ICF కోచ్‌లు ఉన్న రైళ్ల గరిష్ట వేగం గంటకు 140 కి.మీ మాత్రమే. LHB కోచ్‌లు ఉండే రైళ్లతో ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.

 

LHB కోచ్‌లు, ICF కోచ్‌ల కంటే ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి, మంచి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. వీటిలో అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉండటంతో ప్రయాణం చాలా సాఫీగా, హాయిగా సాగుతుంది. ICF కోచ్‌ల కంటే వీటి అద్దాలు పెద్దవిగా ఉండటమే కాకుండా, చూడటానికి కూడా చాలా మోడర్న్‌గా ఉంటాయి.

 

LHB కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారవుతాయి. అందుకే అవి తేలికగా ఉండటమే కాకుండా చాలా ఎక్కువ కాలం మన్నుతాయి. వీటికి తక్కువ మెయింటెనెన్స్ అవసరం. అయినా ICF కోచ్‌ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తాయి. ICF కోచ్‌లు సాధారణ ఉక్కుతో తయారవుతాయి.

 

ICF కోచ్‌ల్లో ఉండే ఎయిర్ బ్రేక్స్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి కానీ రైలును పూర్తిగా ఆపడానికి ఎక్కువ సమయం పడుతుంది. LHB కోచ్‌లలో మాత్రం అడ్వాన్స్‌డ్‌ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా, మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఫీచర్ భద్రతను పెంచడమే కాకుండా, పట్టాలు తప్పే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. LHB కోచ్‌లలోని ఈ బ్రేకింగ్ సిస్టమ్ హై-స్పీడ్ రైళ్లకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

 

LHB కోచ్‌లలో ICF కోచ్‌ల కంటే చాలా తక్కువ శబ్దం, వైబ్రేషన్స్ ఉంటాయి. దీనికి కారణం వాటి అడ్వాన్స్‌డ్‌ సస్పెన్షన్ సిస్టమ్, ఏరోడైనమిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. LHB కోచ్‌లలో ప్రయాణించే వారికి అధిక వేగంతో వెళ్తున్నా ప్రశాంతమైన అనుభూతి లభిస్తుంది. అయితే ICF కోచ్‌లు బాగా శబ్దం చేస్తాయి, బాగోలేని పట్టాలపై ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి. దీనివల్ల సుదూర ప్రయాణాలు అంత సౌకర్యవంతంగా ఉండవు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే! 

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు! 

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు.. 

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Gadgets #Trains #Coaches