ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

Header Banner

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

  Wed Jan 08, 2025 15:03        Politics

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గోకులాల ప్రారంభోత్సవం చేపట్టనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 10,11, 12వ తేదీల్లో గోకులాలను ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వీటిని నిర్మించారు. పల్లెపండుగ వారోత్సవాల్లో వీటి నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పిఠాపురంలో జరిగే కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోకులాలను ప్రారంభించాలని నిర్ణయించింది. జనవరి 10 నుంచి 12 వరకూ మూడు రోజుల పాటు గోకులాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల కోసం 2024 అక్టోబర్ 14 నుంచి 20 వరకూ ఏపీ ప్రభుత్వం పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామసభలో తీర్మానించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ రకంగానే పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గోకులాలను ఏర్పాటు చేశారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ గోకులాలకు జనవరి 10 నుంచి 12వ తేదీ వరకూ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు షెల్టర్ల కోసం ఈ గోకులాలను నిర్మించారు. వీటి ప్రారంభోత్సవాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా జనవరి పదో తేదీన కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇతర జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గోకులాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, డ్వామా స్కీమ్ సంచాలకులకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

జిల్లా స్థాయిలో జరిగే ప్రారంభోత్సవాల్లో సంబంధిత జిల్లాల మంత్రులు పాల్గొంటారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు,మండల స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో మండల స్థాయి ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రారంభోత్సవం పూర్తైన తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలను బ్లూఫ్రాగ్ మొబైల్ యాప్‌లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, డీపీసీలు ప్రారంభోత్సవాల ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పా్ట్లు చేయాలని సూచించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే! 

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు! 

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు.. 

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP