సంక్రాంతి రద్దీకి హైదరాబాద్-విజయవాడ హైవే సిద్ధమా? విస్తరణ పనుల్లో వేగం!

Header Banner

సంక్రాంతి రద్దీకి హైదరాబాద్-విజయవాడ హైవే సిద్ధమా? విస్తరణ పనుల్లో వేగం!

  Fri Jan 10, 2025 10:25        Others

సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వరుస కడతాయి. ప్రస్తుతం దారి పొడవునా మరమ్మతు పనులు నడుస్తున్నాయి. ఎల్బీనగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వరకు ఆరు వరుసల విస్తరణ పనులు.. దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు బ్లాక్స్పోట్లో (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో) అండర్పాస్లలు, సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. డ్రైవింగ్లో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు సంభవించడంతోపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. చాలాచోట్ల పనులు జరుగుతున్నందున వాహనాలను అప్రమత్తంగా నడపాలని ఎన్హెచ్ఎఐ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఇనామ్గూడ వద్ద అండర్పాస్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.



ఇంకా చదవండితెలంగాణ-ఏపీలో సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ఇదే! కాలెండర్ ప్రకటించిన రాష్ట్రాలు!



పండక్కి వెళ్లే వాహనాలతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశముందని, వంతెన మీద మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు చెప్పారు. అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్ బస్టాప్ల వద్ద విస్తరణ చేపట్టకపోవడంతో ఆయాచోట్ల ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తే అవకాశముంది. మరోవైపు దండుమల్కాపురం నుంచి నందిగామ మధ్య తరచూ ప్రమాదాలు జరిగే 17 ప్రాంతాల్లో మరమ్మతు పనులు నడుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాహనదారులు నిదానంగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ పనులు జరిగే చౌటుప్పల్, చిట్యాల తదితర ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. నిరుడు సంక్రాంతికి చౌటుప్పల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రహదారిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఎన్హెచ్ఎఐ పీడీ నాగేశ్వర్రావును సంప్రదించగా.. గుత్తేదారుతో మాట్లాడి సర్వీసు రోడ్డులో రాకపోకలకు ఆటంకం లేకుండా చూస్తామన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #sankranthi #pongal #traffic #highway #todaynews #flashnews #latestupdate