ఈ లక్షణాలన్నీ ఉన్నాయా.. మైగ్రేన్ సమస్య​ ముంచుకొస్తున్నట్టే! ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలకు కూడా..

Header Banner

ఈ లక్షణాలన్నీ ఉన్నాయా.. మైగ్రేన్ సమస్య​ ముంచుకొస్తున్నట్టే! ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలకు కూడా..

  Fri Jan 10, 2025 10:55        Health

మైగ్రేన్... తీవ్రమైన తలనొప్పి. కణతల వద్ద నుంచి కళ్ల వెనుకగా ఏదో ఒక ఒకవైపుగానీ, తలలో రెండు వైపులగానీ ఈ మైగ్రేన్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఒక్కోసారి గంటా రెండు గంటలకే నొప్పి తగ్గిపోయినా, మెల్లగా అది ఇబ్బంది పెట్టే సమయం పెరుగుతుంది. కొందరిలో రోజులకు రోజులు కొనసాగుతుంది. ఈ మైగ్రేన్ వల్ల ఏ పనిపైనా దృష్టిపెట్టలేరు. నిద్ర సరిగా పట్టదు. ఆహారం కూడా సరిగా తీసుకోలేనంత ఇబ్బంది ఉంటుంది. ఇంతగా ఇబ్బంది పెట్టే మైగ్రేన్ సమస్యను కొన్ని లక్షణాల ఆధారంగా ముందే గుర్తించి, తగిన చికిత్స చేయించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మెడపట్టేసినట్టుగానొప్పిగా ఉండటం...
మెడ వద్ద పట్టేసినట్టుగా ఉండటంనొప్పిగా అనిపించడం కూడా ఒక్కోసారి మైగ్రేన్ దాడి చేయబోతోందనే దానికి సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు.

 

తరచూ మూడ్ మారిపోవడం...
పెద్దగా కారణమేదీ లేకపోయినా చిరాకుగా ఉండటండిప్రెషన్ఒక్కసారిగా యాక్టివ్ గా మారిపోవడం వంటి మానసిక మార్పులు (మూడ్ చేంజ్) తరచూ కనిపిస్తుండటం కూడా మైగ్రేన్ కు ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు.


పొడుస్తున్నట్టుగా ఉండే తలనొప్పి...
తరచూ కాసింత హెచ్చుతగ్గులతో, పొడుస్తున్నట్టుగా ఉండే తలనొప్పి వస్తుండటం కూడా మైగ్రేన్ దాడికి ముందస్తు సూచన అని నిపుణులు చెబుతున్నారు. ఇది మరీ ఇబ్బందిగా ఏమీ ఉండదని, అలాగని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.


వికారం, వాంతులు...
మైగ్రేన్ తలనొప్పి దాడికి ముందు వికారంగా ఉన్న భావన కలుగుతుందని, కొన్నిసార్లు, కొందరిలో వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాంతి రాకున్నా... వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుందని వివరిస్తున్నారు.

 

నీరసం... విపరీతంగా ఆవలింతలు...
ఉన్నట్టుండి ఆరోగ్యంలో మార్పులు వచ్చి... నీరసంగా అనిపిస్తుండటంతరచూ ఆవలింతలు ఎక్కువగా వస్తుండటం వంటివి మైగ్రేన్ తలనొప్పికి ముందస్తు లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు.

 

ఇంకా చదవండి: వారి ఇద్దరిపై పవన్ కల్యాణ్ సీరియస్... క్షమాపణ చెప్పాలని డిమాండ్! అధికారుల నిర్లక్ష్యంపై కఠిన వ్యాఖ్యలు!


కళ్ల ముందు చిత్రమైన దృశ్యాలు...
కళ్ల ముందు ఏవో ఫ్లాష్ లైట్లు వెలిగినట్టుగా అనిపించడం, ఏవేవో వంకర టింకర లైన్లు లేదా నల్లటి మచ్చల్లా కనిపించడం వంటివి కూడా మైగ్రేన్ దాడికి ముందు కనిపించే లక్షణాలు అని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

 

వెలుతురునుధ్వనిని తట్టుకోలేకపోవడం...
వెలుతురుచప్పుళ్లు కాస్త ఎక్కువైనా తట్టుకోలేకపోవడంఏదో ఇబ్బందిగా ఫీలవడం కూడా మైగ్రేన్ కు ముందస్తు లక్షణాలు అని నిపుణులు వివరిస్తున్నారు. 


ఈ అంశాలు గుర్తుంచుకోండి...
పైన చెప్పిన లక్షణాలన్నీ మైగ్రేన్ కు సంబంధించి ఆరోగ్య నిపుణులు వెల్లడించినవి. ఆయా లక్షణాలు వేరే ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలకు కూడా సూచిక కావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #migraine #Health #Healthcare #Viralnews